Begin typing your search above and press return to search.

ఇలా F3 టీమ్ లో చేరిందో లేదో కానీ ..!

By:  Tupaki Desk   |   30 Oct 2021 6:32 AM GMT
ఇలా F3 టీమ్ లో చేరిందో లేదో కానీ ..!
X
యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి `ఎఫ్ -2` కి సీక్వెల్ గా ఎఫ్ -3ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `ఎఫ్ -2` లో న‌టించిన న‌టీన‌టుల‌తోనే ఈ సీక్వెల్ ని తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఇందులో క‌థాంశం యూనిక్ గా ఉంటుంద‌ని కామెడీ.. ఎమోష‌న్ కంటెంట్ హైలైట్ గా సాగుతుంద‌ని కూడా రావిపూడి వెల్ల‌డించారు. వెంక‌టేష్ కు జోడీగా త‌మ‌న్నా..వ‌రుణ్ తేజ్ కి జోడీగా మెహ్రీన్ న‌టిస్తున్నారు. ఇక మూడ‌వ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ని ఇటీవ‌ల ఎంపిక చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

సోనాల్ రాక‌తో అంతా మారిపోయింది. ఇందులో సోనాల్ పాత్ర కూడా ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంద‌ని యూనిట్ తెలిపింది. సోనాల్ ఎంట్రీతో సినిమాకు మంరింత మ‌సాలా ద‌ట్టించిన‌ట్లు అయింద‌ని చిత్ర వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ ముంబై సోయ‌గం ఆన్ సెట్స్ నుంచి రెడ్ హాట్ శారీలో మంట‌లు రేపిన ఫోటోలు ఇన్ స్టాలో వైర‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే.

క‌ట్టుబొట్టు..చీర‌లో సోనాల్ స్టైలే వేరు. ఇప్ప‌టికే ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించి టాలీవుడ్ ఆడియ‌న్స్ ని ఆక‌ట్టుకుంది. అంత‌కు ముందు టెంప్టింగ్ ఫోటోషూట్ల‌తో ఇన్ స్టాలో మంట‌లు రేపిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. తాజాగా సోనాల్ మ‌రోసారి లోదుస్తుల్లో అగ్గి రాజేస్తోంది. టాప్ అండ్ బాట‌మ్ లో బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తుల్లో మంట‌లు రేపుతోంది. సోనాల్ క‌వ్వింత‌ కట్టిప‌డేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఫాలోవ‌ర్స్ నుంచి కామెంట్లు అదే స్థాయిలో ప‌డుతున్నాయి.

తెలుగులో సోనాల్ కెరీర్ మ్యాట‌ర్ ని ప్ర‌స్తావిస్తే .. `రెయిన్ బో ` చిత్రంతో ప‌రిశ్ర‌మ‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత బాల‌య్య స‌ర‌స‌న `లెజెండ్` లో సెకెండ్ లీడ్ లో న‌టించింది. ఆ సినిమా హిట్ గుర్తింపు నిచ్చింది. ఈ నేప‌థ్యంలోనే `పండ‌గ చేస్కో`..`షేర్` చిత్రాల్లో అవ‌కాశాలు అందుకుంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ బాల‌య్యే అకాశాలు క‌ల్పించారు. `డిక్టేట‌ర్`..`రూల‌ర్ `చిత్రాల్లో న‌టించింది. కానీ ఆ చిత్రాలు రెండు బాక్సాఫీస్ వ‌ద్ద రాణించ‌లేదు. కొంత గ్యాప్ త‌ర్వాత అనీల్ రావిపూడి ఎఫ్ 3 లో న‌టించే ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాపై చాలా ఆశ‌లే పెట్టుకుంది సోనాల్.