Begin typing your search above and press return to search.

కాఫీ బూతు షో అన్నారు.. కానీ రికార్డులెలా..?

By:  Tupaki Desk   |   30 Aug 2022 4:05 AM GMT
కాఫీ బూతు షో అన్నారు.. కానీ రికార్డులెలా..?
X
ఇటీవ‌లి కాలంలో అత్యంత భారీ విమ‌ర్శ‌ల‌కు గురైన ఏకైక షోగా 'కాఫీ విత క‌ర‌ణ్' పేరు మార్మోగింది. విమ‌ర్శ‌కులు ఈ షోని బూతు షోగా అభివ‌ర్ణించారు. బెడ్ రూమ్ ర‌హ‌స్యాలు ప్రేమ‌జంట‌ల రొమాంటిక్ లైఫ్ గురించి.. డేటింగులు బ్రేక‌ప్ ల గురించి బ‌హిరంగంగా ప్ర‌శ్నిస్తూ క‌ర‌ణ్ టీఆర్పీ గేమ్ ఆడాడాని విమ‌ర్శించారు. కరణ్ జోహార్ హోస్టింగ్‌ చేసిన అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ టాక్ షోగా కాఫీ విత్ కరణ్ సీజన్ 7 ఇప్పటివరకు 8 ఎపిసోడ్ లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రీమియర్ అయ్యాయి.

ఈ షో గత 8 వారాలుగా వరుసగా ట్రెండింగ్ లో ఉందని కేటగిరీలో టాప్ 5 స్థానాల్లో అత్యధిక వీక్ష‌ణ‌ల‌తో కొన‌సాగుతోంద‌ని రికార్డుల గురించి ప్ర‌స్థావిస్తూ క‌ర‌ణ్ ఆనందం వ్య‌క్తం చేశారు. టైగర్ ష్రాఫ్ - కృతి సనన్ ల‌తో తదుపరి ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ షో ప్రతి గురువారం ప్రీమియర్ గా ప్రదర్శిత‌మ‌వుతోంది. రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతోంది.

ఎంత ఎక్కువ ట్రోల్ చేస్తే అంత పెద్ద స‌క్సెస్ కాఫీ విత్ క‌ర‌ణ్ ఎనిమిది సీజ‌న్లు పూర్త‌య్యాయి. ప్ర‌తి సీజ‌న్ ఓటీటీలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు టాప్ స్టార్ల‌తో ఎపిసోడ్స్ ప్ర‌జ‌ల్ని అల‌రించాయి. అయితే కాఫీ విత్ క‌ర‌ణ్ షోని ద్వేషిస్తూ త‌న‌ను తిడుతున్నార‌ని క‌ర‌ణ్ ఆవేద‌న చెందాడు. అంతేకాదు వినోదాన్ని ద్వేషిస్తూనే గొప్ప‌గా ఆద‌రిస్తున్నార‌ని కూడా ఆనందం వ్య‌క్తం చేశాడు. ఎవ‌రైనా ప్ర‌జలు సుదీర్ఘంగా తిడుతూ వ్యాసం రాసారంటే వారి జీవితం నుంచి ఎంతో విలువైన స‌మ‌యాన్ని నాకోసం కేటాయించార‌ని అర్థం అంటూ రివ‌ర్స్ పంచ్ లు కూడా వేసాడు క‌రణ్‌. ఇంకా చెప్పాలంటే ఎవ‌రు ఎంత ఎక్కువ తిడితే అంత పెద్ద స‌క్సెస్ సాధించిన‌ట్టేన‌ని అన్నారు.

మ‌మ్మ‌ల్ని ఎందుకు తిట్టినా కానీ షోని విప‌రీతంగా చూస్తున్నారనేది నిజం అని క‌ర‌ణ్ అన్నారు. ఇప్పటికే కియారా అద్వానీ - షాహిద్ కపూర్ లతో ఎనిమిది ఎపిసోడ్ లుగా అల‌రించింది. కొత్త సీజన్ అట్టహాసంగా ప్రారంభమై అంతే రంజుగా సాగింది. బాలీవుడ్ లోనే కాకుండా దక్షిణాది నుండి కూడా చాలా మంది A-లిస్ట‌ర్ స్టార్లు ఈ షోలో క‌నిపించారు. ఇటీవల షోపై అనవసరమైన ట్రోలింగ్ గురించి క‌ర‌ణ్ ఓపెన‌వుతూ... కొన్నిసార్లు ద్వేషాన్ని వినోదభరితంగా చూస్తాన‌ని కూడా అన్నాడు.

షో విష‌యంలో నిజానికి ఎంత ద్వేషం ఉందో ఎలాంటి ట్రోలింగ్ సాగుతోందో నాకు తెలియదు. కానీ ఇలాంటి ఒక షో ఉనికిలో ఉందనేది అంద‌రికీ తెలిసింది. ప్ర‌జ‌ల‌ ద్వేషాన్ని ప‌రిశీలిస్తే.. కొన్నిసార్లు వినోదభరితంగా ఉంటుంది.. ఎందుకంటే వారు షోని ఎందుకు ఎక్కువగా తిట్టారు అన్న‌ది అటుంచితే షోని ఎక్కువ‌గా చూస్తున్నారు క‌దా? నేను ట్విట్టర్ స‌హా ఇతర పోర్టల్స్ లో థ్రెడ్ లను చదివాను. KWK గురించి ప్రజలు ఉపన్యాసాలు ఇచ్చిన‌ రీల్స్ కి నేను చాలా కదిలిపోయాను. గుండెల్ని తాకినట్లు భావిస్తున్నాను. నేను దీనిని ఇష్టపడుతున్నాను.. మీరు చాలా అసహ్యించుకున్న దానిపై ఇంత సుదీర్ఘ కాలమ్ రాయడానికి మీరు మీ జీవితాల నుండి చాలా సమయం కేటాయించారనేది నిజం! అంటూ త‌న‌దైన శైలిలో చ‌తుర‌త చూపాడు క‌ర‌ణ్‌.

"నేను నిజాయితీగా ఉంటాను.. నేను విద్వేషాన్ని సమర్థించను.. కానీ దాని గురించి మాట్లాడటానికి నాకు నేను రుణపడి ఉంటాను. ఇలాంటి విద్వేష చ‌ర్య విప‌రీత‌మైన‌ది! అని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. అందుకే నేను దాని గురించి మాట్లాడకపోతే ఇప్పటికీ దాని వ‌ల్ల‌నే నేను బాధపడుతున్నానని ప్రజలు అనుకోవచ్చు" అని అన్నాడు. ఒక ర‌కంగా త‌న‌ను త‌న షోని ద్వేషించేవాళ్ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోన‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు క‌ర‌ణ్‌.

కాఫీ విత్ కరణ్ 7 చివరి ఎపిసోడ్ ల‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌- అన‌న్య పాండే... విక్కీ కౌశల్ - సిద్ధార్థ్ మల్హోత్రా.. కియ‌రా - షాహిద్ కనిపించారు. కొత్త సీజన్ లో కృతి సనన్- టైగర్ ష్రాఫ్..... అనిల్ కపూర్- వరుణ్ ధావన్ అతిథులుగా కనిపించనున్నారు. అర్జున్ - మలైకా జంట‌.. గౌరీ ఖాన్- అమీర్ ఖాన్- మహీప్ కపూర్- భావన పాండే కూడా త‌దుప‌రి ఎపిసోడ్స్ లో కనిపించనున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.