Begin typing your search above and press return to search.

రవితేజ 3కి పెద్ద సవాల్ !

By:  Tupaki Desk   |   6 Sep 2018 2:30 PM GMT
రవితేజ 3కి పెద్ద సవాల్ !
X
గత ఏడాది రాజా ది గ్రేట్ బ్లాక్ బస్టర్ కాకపోయినా డీసెంట్ హిట్ అనిపించుకోవడంతో మాస్ మహారాజా రవితేజ ట్రాక్ లో పడ్డట్టే కనిపించింది. సినిమాలు చేసినా గ్యాప్ ఇచ్చినా తనకంటూ ఒక ఫాలోయింగ్ ని మైంటైన్ చేస్తున్న రవితేజకు ఈ ఏడాది పెద్ద షాకే ఇచ్చింది. కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ వైఫల్యంతో టచ్ చేసి చూడు ప్లాప్ ఖాతాలో చేరిపోగా బ్రాండ్ ఉన్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఊర మాస్ సినిమా చేయటంలో బాలన్స్ తప్పడంతో నేల టికెట్టు డిజాస్టర్ గా మిగిలింది. అందుకే రాబోయే అమర్ అక్బర్ ఆంటోనీ మీదే ఆశలన్నీ పెట్టుకున్నారు అభిమానులు. శ్రీను వైట్ల ట్రాక్ రికార్డు గత నాలుగేళ్లలో ఎంత బ్యాడ్ గా ఉన్నా కథ మీద నమ్మకంతో స్నేహ ధర్మం కొద్దీ రవి ఓకే చేసాడు. అమెరికా షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన టీమ్ కు బిజినెస్ కు సంబంధించి కొత్త టెన్షన్ పట్టుకుందని ఇన్ సైడ్ టాక్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అయినప్పటికీ బయ్యర్లు చాలా తక్కువ రేట్ కోట్ చేస్తున్నారని తెలిసింది. దానికి తోడు హిందీ డిజిటల్ మార్కెట్ కూడా అంతంత మాత్రంగా ఉండటంతో ఎక్కువ వచ్చే అవకాశం కనిపించడం లేదట.

నిజానికి అమర్ అక్బర్ ఆంటోనీలో రవితేజను పక్కన పెడితే మరీ ఎగ్జైట్ చేసే అంశాలు పెద్దగా లేవు. హీరోయిన్ ఇలియానాను ప్రేక్షకులు ఏనాడో మర్చిపోయారు. కం బ్యాక్ ఇస్తున్నా ఎవరు అంత ప్రత్యేకంగా చూడటం లేదు. టైటిల్ కూడా అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం వచ్చిన పాత హిందీ పేరు కావడంతో స్పెషల్ గా అనిపించడం లేదు. మూడు పేర్లు ఉన్నాయి కాబట్టి రవి త్రిపాత్రాభినయం చేస్తున్నాడా లేక శీను వైట్ల సినిమాల్లో రొటీన్ గా కనిపించే క్యారెక్టర్ స్వాపింగ్ లో మూడు సార్లు కనిపిస్తాడా ప్రస్తుతానికి సస్పెన్స్. శీను వైట్లకు ఈ సినిమా మెడ మీద కత్తి లాంటిది. కొనసాగాలి అంటే ఇది యావరేజ్ కాదు సూపర్ హిట్ అయ్యే తీరాలి. ఏ మాత్రం తేడా వచ్చినా కోలుకోవడం కష్టమే. ఈ నేపధ్యంలో ఇంత లో బజ్ తో ఓపెనింగ్స్ భారీగా రావడం కష్టం కనక ప్రమోషన్ విషయంలో శ్రద్ధ తీసుకుంటే తప్ప జనం దీని గురించి మాట్లాడుకోవడం ఈజీ కాదు. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్ టీజర్ కోసం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. దాంతో అయినా అంచనాలు మారతాయేమో చూడాలి.