Begin typing your search above and press return to search.

లక్షలు దాటి కోట్లు చేరిన సంపూ బాబు

By:  Tupaki Desk   |   7 Aug 2021 6:43 AM GMT
లక్షలు దాటి కోట్లు చేరిన సంపూ బాబు
X
బర్నింగ్ స్టార్‌ సంపూర్నేష్‌ బాబు సినిమాలు వరుసగా రాబోతున్నాయి. కాలీఫ్లవర్‌.. బజార్ రౌడీలతో పాటు మరో సినిమాను కూడా ఈయన మొదలు పెట్టాడు. ఈనెలలో బజార్ రౌడీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 20వ తారీకున విడుదలకు సిద్దం అయిన బజార్ రౌడీ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రెండున్నర నుండి మూడు కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆ సినిమా బిజినెస్ చేసే పనిలో ఉన్నారు. సంపూ కెరీర్‌ లో ఇది భారీ బడ్జెట్‌ చిత్రంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు లక్షల్లోనే ఈయన సినిమాలు ఉండేవి. కాని ఇప్పుడు మాత్రం ఈయన సినిమా కోటి దాటి ఏకంగా మూడు కోట్లు చేరిదంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

బజార్ రౌడీ కామెడీతో కాస్త ఆకట్టుకున్నా కూడా వసూళ్ల రూపంలో కొంత.. శాటిలైట్ మరియు ఓటీటీ ద్వారా మరి కొంత రావడం ఖాయం. కనుక సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. బజార్ రౌడీ బ్రేక్‌ ఈవెస్ సాధిస్తే ముందు ముందు సంపూర్నేష్‌ బాబు మార్కెట్‌ 5 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ఆయన పారితోషికం కూడా భారీగానే పెంచే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత సినిమాలు థియేటర్ల ద్వారా విడుదల అవుతున్నా కూడా జనాలు ఇంకా పూర్తి స్థాయిలో ఆసక్తిచ ఊపడం లేదు. ఆగస్టు చివరి వారంలో ఈ సినిమా రాబోతుంది కనుక అప్పటి వరకు పరిస్థితులు ఏమైనా మార్పు వస్తుందో చూడాలి. సంపూర్నేష్ బాబు సినిమా అంటే అందరిలో కాకున్నా కొందరిలో ఇంట్రెస్ట్‌ అయితే కచ్చితంగా ఉంది. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు కనుక పాజిటివ్ టాక్ వస్తే టైమ్‌ పాస్ కు వెళ్దాం అనుకునే వారు చాలా మందే ఉంటారు. కనుక బజార్‌ రౌడీతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొనబోతుందా అనేది చూడాలి.