Begin typing your search above and press return to search.

మాయావితో చేతులు క‌లిపిన బ‌న్ని.. సీక్వెల్ కోస‌మా?

By:  Tupaki Desk   |   8 Nov 2020 11:05 AM IST
మాయావితో చేతులు క‌లిపిన బ‌న్ని.. సీక్వెల్ కోస‌మా?
X
ఈ సంవత్సరం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ జోడీ `అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిన‌దే. సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం నాన్ `బాహుబలి` రికార్డ్ సాధించి ది బెస్ట్ గా నిలిచింది. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో జులాయి- స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాలు వ‌చ్చాయి. ఈ రెండు చిత్రాల‌కు మించి `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

త్ర‌విక్ర‌మ్ -బ‌న్ని క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఈ మూడు చిత్రాలు సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో ఈ కాంబినేష‌న్ కు మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. వీరి క‌ల‌యిక‌లో సినిమా అంటే అంచ‌నాలు అంచ‌నాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మ‌రోసారి వీరిద్ద‌రు క‌లిసి ప‌ని చేయబో‌తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. అయితే ఈసారి సినిమా కోసం మాత్రం కాదు. `ఆహా` ఓటిటీ ప్ర‌చార చిత్రం కోసం వీరిద్ద‌రూ క‌లిసి ప‌నిచేస్తున్నారు.

ఈ ప్ర‌చార చిత్రం దీపావ‌ళికి రిలీజ్ కాబోతోంది. త్రివిక్ర‌మ్ మాట‌ల గార‌డీ.. బ‌న్నీస్టైలిష్ ప్ర‌జెంటేష‌న్ తో ఈ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ ఆద్యంతం కొత్త‌గా వుండ‌బోతోంద‌ని తెలుస్తోంది. `ఆహ‌`లో కొత్త‌గా 5 షోలు కొత్త సినిమాల‌తో సిద్ధ‌మ‌వుతోంది. న‌వంబ‌ర్ 13 నుంచి వీటి హంగామా ప్రారంభం కాబోతోంది. మాయావితో చేతులు క‌లిపిన బ‌న్ని ఆహాను మ‌రో మెట్టు ఎక్కిస్తాడేమో చూడాలి.