Begin typing your search above and press return to search.

తేజ్ రోడ్డు ప్రమాదం గురించి మెగా ఫ్యామిలీలో తొలుత తెలిసింది అతడికే

By:  Tupaki Desk   |   13 Sept 2021 11:08 AM IST
తేజ్ రోడ్డు ప్రమాదం గురించి మెగా ఫ్యామిలీలో తొలుత తెలిసింది అతడికే
X
పండుగపూట అందరూ పూజలు పూర్తి చేసుకొని.. సాయంత్రం కాస్తంత సరదాగా బయటకు వస్తున్న వారికి.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసి షాక్ తిన్నారు. ఎందుకంటే.. మిగిలిన వారికి భిన్నంగా తేజ్ మీద ఎలాంటి నెగిటివ్ రిమార్కులు లేకపోవటమే కారణం. హెల్పింగ్ నేచర్ ఎక్కువని.. ఎవరికైనా ఏమైనా అవసరమైతే.. సాయం చేయటానికి ముందుంటాడని.. రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగితే.. కారు ఆపి మరీ.. సాయం చేసే తత్త్వం ఎక్కువన్న విషయానికి సంబంధించిన ఉదంతాలు గతంలో చోటు చేసుకున్నాయి. దీంతో.. అతగాడి మీద సాఫ్ట్ కార్నర్ ఎక్కువ.

అనూహ్యంగా రోడ్డు ప్రమాదానికి గురైన తేజ్ గురించిన సమాచారం మెగా ఫ్యామిలీలో మొదట తెలిసింది బన్నీకే కావటం గమనార్హం. ప్రస్తుతం కాకినాడలో పుష్ప షూటింగ్ లో ఉన్న అతడికి.. స్నేహితల ద్వారా రోడ్డు ప్రమాదం గురించి సమాచారం అందినట్లు చెబుతన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తేజ్ ను ఘటనాస్థలానికి దగ్గర్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.

అక్కడే ఆయన్ను హీరో సాయి ధరమ్ తేజ్ గా గుర్తించటం.. ఈ విషయం తెలిసిన ఆసుపత్రి సిబ్బందిలో ఒకరు.. అల్లు అర్జున్ స్నేహితుడు కావటంతో వెంటనే.. అతనికి ఫోన్ చేసి సమాచారాన్ని అందించారు. వెంటనే రియాక్టు అయిన బన్నీ.. ప్రమాద తీవ్రత గురించి.. గాయాల గురించి వివరాలు తెలుసుకొని వెంటనే మామయ్య మెగాస్టార్ చిరంజీవికి.. అత్తయ్య సరేఖలకు సమాచారం ఇచ్చారు.

మెడికవర్ లో ఉన్న తన స్నేహితుల ద్వారా ఎప్పటికప్పుడు తేజ్ ఆరోగ్యయ గురించి తెలుసుకుంటున్న అల్లు అర్జున్.. తన కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. మరోవైపు.. సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు మరింత ఫోకస్ పెట్టారు. ప్రమాదం జరగటానికి ముందు.. అతడి వాహనం ఎక్కడెక్కడ తిరిగిందన్న విషయాన్ని సీసీ కెమేరాల ద్వారా వడబోసి.. అతని డ్రైవింగ్ ఎలా సాగింది? ఉల్లంఘనలకు పాల్పడ్డారా? లాంటి అంశాల్ని పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది.