Begin typing your search above and press return to search.

బన్నీ అంత సిల్లీగా ప్రవర్తించడు

By:  Tupaki Desk   |   10 Feb 2020 10:00 AM IST
బన్నీ అంత సిల్లీగా ప్రవర్తించడు
X
అల్లు అర్జున్‌ మొన్న సంక్రాంతికి అల వైకుంఠపురంలో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యి బన్నీ కెరీర్‌ లోనే టాప్‌ చిత్రంగా నిలిచింది. ఇక ఇండస్ట్రీలో కూడా టాప్‌ చిత్రాల జాబితాలో చేరింది. ఇంతటి ఘన విజయానికి ప్రధాన కారణం ఈ చిత్రంలోని సంగీతం అంటూ ప్రతి ఒక్కరు అంటున్నారు. ఆ విషయాన్ని స్వయంగా త్రివిక్రమ్‌ మరియు అల్లు అర్జున్‌ లు కూడా ఒప్పుకున్నారు. పాటలతో మ్యాజిక్‌ చేయడం వల్లే ప్రేక్షకులు థియేటర్ల వరకు వచ్చారంటూ త్రివిక్రమ్‌ సక్సెస్‌ వేడుకలో అన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌ లో థమన్‌ జోరు సాగుతుంది.

థమన్‌ ముందు మరే సంగీత దర్శకుడు కూడా నిలవలేక పోతున్నాడు అన్నట్లుగా ఆయన దూసుకు పోతున్నాడు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వరుసగా చిత్రాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఈ సమయంలోనే బన్నీ ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియా లో ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం ప్రకారం బన్నీ తదుపరి చిత్రంను సుకుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు మొదట దేవిశ్రీ ప్రసాద్‌ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని పాటల కంపోజింగ్‌ కూడా అయ్యింది. ఇలాంటి సమయంలో సుకుమార్‌ ను ఒత్తిడి చేసి థమన్‌ ను ఈ చిత్రంలోకి తీసుకు వచ్చేందుకు బన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది ఆ పుకార్ల సారాంశం.

సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లు మరీ సిల్లీగా ఉన్నాయని.. బన్నీ మరీ అంత సిల్లీగా ప్రవర్తించడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. బన్నీ కెరీర్‌ లో ఎన్నో మ్యూజికల్‌ సక్సెస్‌ లు ఉంటే ఎక్కువగా దేవిశ్రీ ప్రసాద్‌ ట్యూన్స్‌ ఉంటాయి. అలాంటిది సినిమాలో ఛాన్స్‌ ఇచ్చి మళ్లీ తొలగించడం అనేది అస్సలు ఛాన్స్‌ లేదు. సుకుమార్‌ మరియు దేవిలు ఇప్పటికే నాలుగు నెలలుగా కూర్చుని ట్యూన్స్‌ రెడీ చేశారు.

ఈ సమయంలో థమన్‌ ను తీసుకుని రమ్మంటు బన్నీ ఒత్తిడి చేశాడు అంటూ వార్తలు రావడం సిల్లీ కాకుంటే మరేంటి అంటూ మెగా ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థమన్‌ పై అభిమానం ఉంటే ఆ తర్వాత నటించబోతున్న సినిమాకు బన్నీ ఎంపిక చేసుకుంటాడు. అంతే తప్ప దేవిశ్రీ ని తప్పించి థమన్‌ ను తీసుకోవడం అనేది అస్సలు జరగని పని అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.