Begin typing your search above and press return to search.

బన్నీ vs బాల‌య్య..?

By:  Tupaki Desk   |   18 Aug 2021 8:00 AM IST
బన్నీ vs బాల‌య్య..?
X
కరోనా కారణంగా టాలీవుడ్ లో పెద్ద సినిమాల మధ్య క్లాష్ అనేది అనివార్యం అయింది. విడుదల వాయిదా పడిన సినిమాలతో పాటుగా.. ఇప్పుడు కొత్తగా రెడీ అయిన సినిమాలన్నీ ఒకే సమయంలో రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫెస్టివల్ సీజన్స్ కోసం భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలన్నీ పోటీ పడుతున్నాయి. ఇప్పుటికే దసరా మొదలుకొని సంక్రాంతి వరకు చాలా మూవీస్ విడుదల తేదీలను ప్రకటించాయి. అయితే 'అఖండ' 'ఆచార్య' 'ఖిలాడి' 'లవ్ స్టోరీ' వంటి సినిమాల రిలీజ్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

నటసింహ నందమూరి బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ''అఖండ''. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ విడుదల తేదీని ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాని డిసెంబ‌ర్ లాస్ట్ వీక్ లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందనే టాక్ గ‌ట్టిగా న‌డుస్తోంది.

బాల‌య్య జాత‌కం ప్ర‌కారం డిసెంబర్ నెల‌లో సినిమా విడుద‌ల చేస్తే స‌క్సెస్ అవుతుంద‌ని నమ్మకం ఉందట. దీనిని బట్టి చూస్తే డిసెంబ‌ర్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చెయొచ్చు. ఆ నెలలో జ‌నాలు థియేట‌ర్ల‌కి వ‌చ్చే స‌మయం క్రిస్మ‌స్ పండుగ అని తెలిసిందే. కాబట్టి డిసెంబ‌ర్ 25వ తేదీకి కొంచం అటు ఇటుగా 'అఖండ' చిత్రాన్ని రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కాకపోతే దీనికి బాల‌య్య సైడ్ నుంచి ఫైన‌ల్ డిసిజన్ రావాల్సి ఉందట.

ఒకవేళ ఇదే కనుక జరిగితే బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ - అల్లు అర్జున్ పోటీ పడాల్సి ఉంటుంది. ఎందుకంటే బన్నీ - సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న 'పుష్ప: ది రైజ్: చిత్రాన్ని క్రిష్మస్ కానుకగా 2021 డిసెంబర్ లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి ఇప్పుడు బాలయ్య కూడా అదే టైం కి రావాలని ఫిక్స్ అయితే రెండు సినిమాల మధ్య పోటీ తప్పదు. మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.