Begin typing your search above and press return to search.

అరవయ్యేళ్ల టీనేజర్ ఎవరాయన?

By:  Tupaki Desk   |   28 Oct 2017 9:33 AM GMT
అరవయ్యేళ్ల టీనేజర్ ఎవరాయన?
X
సినిమావాళ్లు పరస్పరం పొగుడుకోవడం కొత్త విషయం కాదు. వీటిలో కొన్ని అతిశయోక్తులు కూడా దొర్లుతుంటాయి. ఒక రకంగా ఇది కూడా అలాంటిదే అనుకోవాలి. ఆది హీరోగా రూపొందుతున్న ‘నెక్ట్స్ నువ్వే’ చిత్రానికి సంబంధించి నిర్మాత బన్నీ వాసు.. ఓ ప్రెస్ మీట్ పెట్టారు. మీడియా వారితో మాట్లాడుతూ.. వి4 బ్యానర్ ద్వారా కొత్త వాళ్లను పరిచయం చేయడానికే ప్రయత్నం జరుగుతోందని.. తమకు మార్గదర్శనం అల్లు అరవింద్ చేస్తుంటారని చెప్పుకొచ్చారు.

గీతాఆర్ట్స్ సంస్థ కేవలం పెద్దసినిమాలు మాత్రమే చేస్తుంటుంది గనుక.. నేరుగా కొత్త వాళ్లకు అంత పెద్ద బ్యానర్ లో అవకాశం ఇవ్వడం కుదరదు గనుక.. వి4 బ్యానర్ లో చేస్తున్నట్లు చెప్పిన ఆయన ఈ బ్యానర్ లో కూడా ప్రతి విషయమూ అరవింద్ సలహాల మేరకు నడుస్తుందని వెల్లడించారు. అరవింద్ గురించి మాట్లాడుతూ.. ఆయన అరవయ్యేళ్ల టీనేజర్ లాంటి వారని.. సాధారణంగా ఎవ్వరికైనా 19 ఏళ్లకే టీనేజ్ పూర్తయిపోతుందని.. కానీ అరవింద్ గారికి 60 ఏళ్లు వచ్చినా అది కంటిన్యూ అవుతోందని.. అంతటి ఉత్సాహంగా నిత్యం పనిచేస్తుంటారని కితాబులిచ్చారు.

అరవింద్ ఒక వంద పేజీల పుస్తకంలాంటి వారని.. ఆ పుస్తకాన్ని అయిదారు పేజీలకు మించి చదవడం కూడా ఎవ్వరికీ సాధ్యం కాదని.. తాను మాత్రం కాస్త ముందుకెళ్లి పదిహేను పేజీలదాకా చదవగలిగానని బన్నీ వాసు చెప్పుకొచ్చారు.

బన్నీవాసు చాలా మాటలు చెప్పినప్పటికీ.. అరయ్యేళ్ల టీనేజర్ అనే కితాబు బాగానే ఉంది. అల్లు వారి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఇద్దరు హీరోలు ఉన్నారు. ఈ పొగడ్త బాగున్నది కదాని.. మూడో హీరోగా ఏకంగా సరికొత్త టీనేజర్ గా అల్లు అరవింద్ ఎంట్రీ ఇస్తారేమో!!