Begin typing your search above and press return to search.

నిర్మాత బన్నీవాసు ఇంట్లో తీవ్ర విషాదం

By:  Tupaki Desk   |   12 Dec 2020 5:07 AM GMT
నిర్మాత బన్నీవాసు ఇంట్లో తీవ్ర విషాదం
X
ప్రముఖ నిర్మాత బన్నివాసు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బన్ని వాసు సోదరుడు గవర సురేష్ శుక్రవారం రాత్రి మృతి చెందారు. కిడ్నీలు ఫెయిల్ అవడంతో కొద్దిరోజులుగా బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన సురేష్ శుక్రవారం రాత్రి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో మృతి చెందారు. దీంతో బన్నివాసు కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. సురేష్ కు భార్య, కుమారుడు ఉన్నారు.

టాలీవుడ్ లో హీరో అల్లుఅర్జున్ కు బన్నీవాసు అత్యంత సన్నిహితుడు. అల్లు అర్జున్ కు సంబంధించిన సినిమా వ్యవహారాలు అన్నింటిని బన్నీ వాసు చూసుకుంటూ ఉంటాడు. బన్నీ వాసు నిర్మాతగా మారి పలు చిత్రాలను కూడా నిర్మించాడు. ముఖ్యంగా అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ బ్యానర్ తో కలిసి పలు చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్నాడు. ఇటీవల విడుదలైన ప్రతి రోజు పండగే, గీత గోవిందం, నా పేరు శివ, శ్రీరస్తు శుభమస్తు తదితర సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించాడు.

బన్ని వాసు అన్న సురేష్ ఇంజనీరింగ్ చేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇంజనీరు లో టాప్ పోర్లో ఒకరిగా ఉన్నారు. డీజిల్ పెట్రోల్ ఫోర్ వీలర్ వెహికళ్లను సీఎన్జీలోకి కన్వర్షన్ చేసే కిట్ల తయారీ కంపెనీ స్థాపించి అందులో విజయవంతమై మంచి పేరు సంపాదించుకున్నారు. సురేష్ అకాల మరణంతో బన్నీ వాసు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు. బన్ని వాసును పరామర్శించారు.