Begin typing your search above and press return to search.

లీకేజ్ వల్ల మాకు నష్టమే జరిగింది:బన్నీ వాస్

By:  Tupaki Desk   |   19 Aug 2018 5:30 PM GMT
లీకేజ్ వల్ల మాకు నష్టమే జరిగింది:బన్నీ వాస్
X
విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'గీత గోవిందం' బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ విడుదలకు ముందే ఈ సినిమా లీక్ కు గురి కావడంసంచలనం సృష్టించింది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విజయ్ - నిర్మాతలయిన అల్లు అరవింద్ - బన్నీ వాస్ లు ఈ విషయం పై తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు సినిమా సూపర్ హిట్ కావడంతో అందరూ హ్యాపీ కానీ ఈ సినిమాను ఫిలిం యూనిట్ కావాలనే లీక్ చేసిందని సోషల్ మీడియాలో ఈమధ్య చర్చ జరిగింది.

ఈ వ్యవహారం పై స్పందించిన బన్నీ వాస్ "ఎవరైనా మొత్తం సినిమాను కావాలని లీక్ చేస్తారా? ఎదో ఒకటి అరా సీన్లు లీకయ్యాయి అంటే అలా అనుకోవచ్చు. దీనికి సంబంధించిన కేసును హై రేంజ్ పోలీస్ ఆఫీసర్ హ్యాండిల్ చేశారు. మేం కావాలని లీక్ చేస్తే ఆయన ఈ కేసును టేకప్ చేస్తారా? ఈ ఆరోపణలు అబద్దం. లీకేజీ వల్ల మాకు లాభం కాదు చాలా నష్టమే జరిగింది. కొన్ని కాలేజీలు - స్కూళ్ల ఆడిటోరియాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. చాలా దారుణమిది. దాని వల్ల కలెక్షన్లు తగ్గిపోతాయి. ఇన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా వేరే వాళ్ల ల్యాప్ టాప్‌ లో ఉందంటే ఎంత బాధ కలుగుతుంది? ఆ 10 రోజులు నరకం కనిపించింది" అన్నాడు.

అంతే కాదు ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకుడదని చెప్పాడు. ఏదేమైనా ఈ సినిమా అడ్డంకులన్నీ దాటుకొని విజయం సాధించడం తమకు సంతోషం కలిగించిందని చెప్పాడు. సినిమా రిలీజ్ కాకమునుపే లీకయినప్పటికీ సూపర్ హిట్ అయిన 'గీత గోవిందం' ను చాలామంది పవన్ కళ్యాణ్ సినిమా 'అత్తారింటికి దారేది' తో పోలుస్తున్నారు. పవన్ సినిమా విషయం లో కూడా ఇలానే జరిగిన విషయం తెలిసిందే.