Begin typing your search above and press return to search.

మిత్రులతో కలిసి ఏటీటీ రంగంలోకి బన్నీవాస్ ఎంట్రీ?

By:  Tupaki Desk   |   28 July 2020 3:30 AM GMT
మిత్రులతో కలిసి ఏటీటీ రంగంలోకి బన్నీవాస్ ఎంట్రీ?
X
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే ఉద్దేశ్యంలో భాగంగా సినిమా థియేటర్లు మూతబడిన విషయం తెలిసిందే. దీంతో ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది ఏటీటీ. అంటే ఎనీ టైమ్ థియేటర్. సినిమా విడుదలైనప్పుడు థియేటర్‌కు వెళ్లి చూడటం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇది అందుబాటులో లేకపోవడంతో ఆన్‌లైన్‌లో డబ్బులు ఇచ్చి చూడటానికి ఎనీ టైమ్ థియేటర్-ATT పేరు వినిపిస్తోంది. శ్రేయా మీడియా ఈ రంగంలోకి ముందుగా ప్రవేశించింది.

ఆ తర్వాత మరికొందరు దీన్ని ఎంచుకున్నప్పటికీ అంతగా సక్సెస్ కాలేకపోయారు. అయితే సరైన కంటెంట్ లేకపోవడం వల్లే వారు సక్సెస్ కాలేకపోయారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఏటీటీలోకి ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ అడుగు పెడుతున్నారట. ఆయన తన స్నేహితులతో కలిసి ఈ ప్లాట్ ఫాంను ఎంచుకున్నారని సమాచారం. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ అందిస్తున్న సాఫ్టువేర్‌ తో రంగంలోకి దిగుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సినిమాను తీసి ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయడంతో పాటు చిన్న సినిమాలను ప్రమోట్ చేయడం, థియేటర్‌లో వదలడం, శాటిలైట్, డిజిటల్ మార్కెటింగ్ వంటి వర్క్ టేకప్ చేయడం.. ఇలా వివిధ కోణాల్లో పని చేసే సంస్థగా ఇది ఉండనుందని తెలుస్తోంది. మిత్రులతో కలిసి మరో రెండు నెలల్లో దీనిని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.