Begin typing your search above and press return to search.

ఊరించి ఉసూరుమనిపించిన బన్నీ త్రివిక్రమ్‌ టీం

By:  Tupaki Desk   |   21 Oct 2019 4:59 PM IST
ఊరించి ఉసూరుమనిపించిన బన్నీ త్రివిక్రమ్‌ టీం
X
అల్లు అర్జున్‌ నటిస్తున్న 'అలవైకుంఠపురంలో' చిత్రంలోని సామజవరగమన.. పాట సెన్షేషనల్‌ సక్సెస్‌ అయిన విషయం తెల్సిందే. 43 మిలియన్‌ ల వ్యూస్‌ ను సొంతం చేసుకున్న ఆ పాట సినిమాలోని ఇతర పాటలపై కూడా ఆసక్తి పెంచేసింది. థమన్‌ తప్పకుండా సినిమాలోని ఇతర పాటలకు కూడా దుమ్ము రేపేలా ట్యూన్స్‌ ఇచ్చి ఉంటాడని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాలోని రెండవ పాట రాములో రాముల.. పాటను దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నామని ఈనెల 21న అంటే నేడు పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేస్తామంటూ టీం అలవైకుంఠపురంలో ప్రకటించింది.

నేడు అల్లు అర్జున్‌ మాస్‌ బిట్‌ రాములో రాముల.. పాట కోసం బన్నీ ఫ్యాన్స్‌ తో పాటు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో గంటలో పాట విడుదల కాబోతుందనగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి బ్యాడ్‌ న్యూస్‌ వచ్చింది. కొన్ని కారణాల వల్ల పాట ప్రోమోను నేడు విడుదల చేయలేక పోతున్నట్లుగా ప్రకటించారు. రేపు అంటే అక్టోబర్‌ 22వ తారీకున సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేస్తామంటూ ప్రకటించారు.

ఈ ప్రకటపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఫన్నీ మీమ్స్‌ ను సోషల్‌ మీడియాలో జనాలు పోస్ట్‌ చేస్తున్నారు. మోసం అంటూ బన్నీ ఫ్యాన్స్‌ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి రాములో రాముల పాట ప్రోమో కోసం నిన్నటి నుండి ఎదురు చూస్తున్న వారు ఈ ప్రకటన చూసి కాస్త ఆవేదన.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి రేపు అయినా ఖచ్చితంగా రాములో రాముల పాట ప్రోమో వస్తుందేమో చూడాలి.