Begin typing your search above and press return to search.

మెగాస్టార్ త‌ర్వాత బ‌న్నితోనే చేస్తాడా?

By:  Tupaki Desk   |   15 July 2020 2:00 PM IST
మెగాస్టార్ త‌ర్వాత బ‌న్నితోనే చేస్తాడా?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇస్పీడ్ గురించి తెలిసిందే. అల వైకుంఠ‌పుర‌ములో క్లీన్ ఇండ‌స్ట్రీ హిట్ గా నిల‌వ‌డంతో బ‌న్ని పేరు అంత‌టా మార్మోగింది. ఆ క్ర‌మంలోనే అత‌డితో సినిమాలు తీయాల‌న్న త‌హ‌త‌హ‌తో ప‌లువురు ద‌ర్శ‌కులు ఉన్నారు. అందులో రేసుగుర్రం ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ముందు వ‌రుస‌లో ఉన్నాడు. సుకుమార్ తో ప్ర‌స్తుత సినిమా `పుష్ప‌`ని పూర్తి చేయ‌గానే సూరికి బ‌న్ని కాల్షీట్లు అడ్జ‌స్ట్ చేయ‌బోతున్నాడ‌న్న స‌మాచారం ఉంది.

అయితే ఈలోగానే అల్లు అర్జున్ క్యూలో మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ పేరు వినిపిస్తోంది. అత‌డే కొర‌టాల శివ‌. బ‌న్నికి స్క్రిప్టు వినిపించేందుకు కొర‌టాల సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. ఇప్ప‌టికే స్క్రిప్టు రెడీ అవుతోంద‌ని స‌మాచారం. ఓవైపు ఆచార్య అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతుంటే ఈ ఖాళీ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుని కొర‌టాల వ‌రుస‌గా ప్రాజెక్టుల‌కు క‌మిట్ కానున్నాడు. ఇప్ప‌టికే త‌న స్నేహితుడు అయిన‌ ఎన్టీఆర్ .. ల‌క్కీ ఛామ్ అయిన‌ మ‌హేష్ ల‌కు అత‌డు క‌థ‌లు వినిపించే ప‌నిలో ఉన్నాడు.

అయితే అత‌డు ఇలా సీరియ‌స్ గా త‌దుప‌రి కెరీర్ ని ప్లాన్ చేయ‌డానికి కార‌ణ‌మేమిటి? అంటే.. ఇప్ప‌టికే ఆచార్య కోసం రెండేళ్లు వేచి చూడ‌డం అత‌డికి న‌చ్చ‌డం లేద‌ట‌. ప్లాన్స్ అన్నీ వృథా అయిపోతుండ‌డంతో నిరాశ‌లో ఉన్నాడు.. ఇక వెంట వెంట‌నే స్టార్ హీరోల‌తో సినిమాలు చేయాల‌న్న‌ది ప్లాన్. అలాగే స్నేహితుడు మిక్కిలినేనితో క‌లిసి సొంత బ్యాన‌ర్ యువ సుధ ఆర్ట్స్ లో సినిమాలు నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌ల్ని వేగ‌వంతం చేస్తున్నాడ‌ని తెలిసింది. బ‌న్నితో సినిమా అంటే గీతా ఆర్ట్స్ తో క‌లిసి సొంత బ్యాన‌ర్ లో కొర‌టాల ప్లాన్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. 2022లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ కెళ్లే వీలుంద‌ట‌.