Begin typing your search above and press return to search.

`పుష్ప‌-2` కంటే ముందే బ‌న్ని-సుక్కూ మ‌రొక‌టి!

By:  Tupaki Desk   |   18 Aug 2021 8:30 AM GMT
`పుష్ప‌-2` కంటే ముందే బ‌న్ని-సుక్కూ మ‌రొక‌టి!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా చిత్రం `పుష్ప`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే. రెండు భాగాలుగా ఈ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ సిరీస్ తెర‌కెక్కుతోంది. ఇందులో మ‌ల‌యాళ స్టార్ ఫ‌హ‌ద్ ఫాజిల్ విల‌న్ గా న‌టిస్తున్నారు. `పుష్ప` పార్ట్ -1 చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌లో ఉంది. అనంత‌రం రెండ‌వ భాగం సెట్స్ కు వెళ్ల‌నుంది. ఈ మ‌ధ్య‌లో బ‌న్ని `ఐకాన్` చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు. అయితే అంత‌కంటే ముందుగా ఐకాన్ స్టార్ సుకుమార్ తో మ‌రో ప్రాజెక్ట్ కూడా చేయ‌బోతున్నారు. ఇంత‌కీ ఎలాంటి ప్రాజెక్ట్? అంటే.. ఆ ఇద్ద‌రు క‌లిసి ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ కోసం ప‌నిచేయ‌బోతున్నారనేది తాజా స‌మాచారం.

ఓ ప్ర‌ముఖ‌ టెలివిజ‌న్ షో వాణిజ్య ప్ర‌క‌ట‌న కోసం ఇద్ద‌రు జ‌త క‌ట్ట‌బోతున్నారు. ఆ యాడ్ కాన్సెప్ట్ ఏంటి? అన్న‌ది ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. అయితే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఇలా క‌మ‌ర్శియ‌ల్ యాడ్ షూట్ కోసం ప‌నిచేయ‌డం అన్న‌ది బ‌న్నీకి ఇదే తొలిసారి. గ‌తంలో ఓ యాడ్ షూట్ కి ఇద్ద‌రు ప‌నిచేసారు. కానీ అది కేంద్ర ప్ర‌భుత్వానికి సంబంధించిన‌ది కావ‌డంతో పూర్తిగా ఇద్ద‌రు ఫ్రీగానే మాన‌వ‌తా దృక్ఫ‌థంతో చేసారు. కానీ ఈసారి స్టార్స్ ఇద్ద‌రు ప్ర‌మోష‌న‌ల్ యాడ్ కోసం ప‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇద్ద‌రికీ ఉన్న క్రేజ్ తో భారీగానే రెమ్యున‌రేషన్ ఛార్జ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈనెలాఖ‌రునాటికి పుష్ప మొద‌టి భాగం షూటింగ్ పూర్త‌వుతుంది. అనంత‌రం ఈ యాడ్ మేకింగ్ లో జాయిన్ కానున్నారు.

అటుపై బ‌న్నీ ఐకాన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. అక్టోబ‌ర్ ..న‌వంబ‌ర్ లో ఐకాన్ సెట్స్ కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని బ‌న్నీ స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం. `పుష్ప` మొద‌టి భాగం క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తోంది. భారీ బ‌డ్జెట్ లో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే తొలి లిరికల్ సాంగ్ ని కూడా రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. మేక మేక సాంగ్ రికార్డ్ వ్యూస్ తో లైక్ ల‌తో అంత‌ర్జాలంలో దూసుకెళ్లింది.

మ‌ల‌యాళ బిజినెస్ కి హైప్ తెచ్చేందుకు!

మ‌ల్లూ అర్జున్ గా అల్లు అర్జున్ ఇప్ప‌టికే కేర‌ళ‌లో పాపుల‌ర‌య్యారు. అత‌డికి ఇప్ప‌టికే ఒక స్ట్రెయిట్ మ‌ల‌యాళ చిత్రానికి మించిన బిజినెస్ అవుతోంది. ఇక పుష్ప కోసం మ‌ల‌యాళం లో ఫేమ‌స్ అయిన ఫ‌హద్ ఫాజిల్ ని రంగంలోకి దించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో జాతీయ ఉత్త‌మ‌న‌టుడు ఫ‌హద్ ఫాజిల్ విల‌న్ పాత్ర పోషిస్తున్నారు. ఆయ‌న పాత్ర చాలా ఫవ‌ర్ ఫుల్ గా ఉండ‌నుంది. బ‌న్నీ-ప‌హ‌ద్ ఫాజిల్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాలో హైలైట్ గా ఉంటాయ‌ని ఇప్ప‌టికే యూనిట్ రివీల్ చేసింది. ఇక ఫ‌హ‌ద్ ఈ సినిమా బిజినెస్ కి ప్ర‌ధాన అస్సెట్ కానున్నారు.

ఇప్ప‌టికే మేక‌ర్స్ ప‌హ‌ద్ పై కొన్ని స‌న్నివేశాలు కూడా చిత్రీక‌రించారు. అయితే క‌రోనా సెకెండ్ వేవ్ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ప‌హ‌ద్ షూటింగ్ లో పాల్గొన‌లేదు. దీంతో టీమ్ ఇత‌ర న‌టీన‌టుల‌పై నే షూట్ చేసారు. తాజాగా ఈ నెల 20 నుంచి ప‌హ‌ద్ ఫాజిల్ మ‌ళ్లీ పుష్ప షూటింగ్ లో పాల్గొన‌బోతున్నారు. ఏక‌ధాటిగా ఆయ‌న‌పై స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. ప‌హ‌ద్ పై చేయాల్సిన స‌న్నివేశాలు అన్నింటిని ఈ షెడ్యూల్ లో పూర్తి చేస్తార‌ట‌. వ‌చ్చె నెలాఖ‌రుక‌ల్లా `పుష్ప` షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.

షూటింగ్ పూర్తికాగానే యూనిట్ పూర్తి స్థాయిలో ప్ర‌చారం ప‌నుల్లో నిమ‌గ్నం కానుంది. అన్ని ప‌నులు పూర్తి చేసి మొద‌టి భాగాన్ని క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.