Begin typing your search above and press return to search.

పుష్ప పై అన్న అంటూ స్టార్ హీరో కామెంట్స్.. బన్నీ రియాక్షన్ వైరల్

By:  Tupaki Desk   |   16 Dec 2021 8:35 AM GMT
పుష్ప పై అన్న అంటూ స్టార్ హీరో కామెంట్స్.. బన్నీ రియాక్షన్ వైరల్
X
అల్లు అర్జున్‌ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా పుష్ప. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా మరో లెవల్ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు నమోదు అవ్వబోతున్నట్లుగా బయ్యర్లు కూడా నమ్మకంగా ఉన్నారు. యూఎస్ లో ప్రీమియర్ కు కూడా అంతా సిద్దం అయ్యింది. ఈ సినిమా కు పలువురు ప్రముఖులు ఆల్ ది బెస్ట్‌ చెబుతూ సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్ లు పెట్టారు. ఇక ఈ సినిమాకు మరియు యూనిట్‌ సభ్యులకు విజయ్ దేవరకొండ కూడా ఆల్ ది బెస్ట్‌ చెబుతూ ట్వీట్స్ చేశాడు.

పుష్ప రాబోతుంది.. ఈ సినిమా కోసం చాలా ఎగ్జైట్ గా ఉన్నాను. ట్రైలర్.. సాంగ్స్‌.. విజువల్స్.. నటన ప్రతి ఒక్కటి కూడా మాస్ అన్నట్లుగా ఉన్నాయి. నెక్ట్స్ లెవల్ తెలుగు సినిమా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా నా ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. అల్లు అర్జున్ అన్న మీకు మాసివ్ సక్సెస్ రాబోతుంది అన్నట్లుగా విజయ్ దేవరకొండ ట్వీట్ లో పేర్కొన్నాడు. రష్మిక మరియు సుకుమార్ లకు కూడా ఆల్ ది బెస్ట్‌ చెప్పాడు. అల్లు అర్జున్ కూడా ఈ ట్వీట్ కు రిప్లై ఇచ్చాడు. మీ ప్రేమకు కృతజ్ఞతలు. మీ హృదయాలను మేము గెలుచుకున్నట్లుగా భావిస్తున్నాం. సినిమా రేపు విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి మీ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నామని అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశాడు.

అల్లు అర్జున్‌ ఈ సినిమా లో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ చేసే లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. భారీ అంచనాల నడుమ సుకుమార్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. రష్మిక మరియు బన్నీ ఇద్దరు కూడా ఈ సినిమా లో డీ గ్లామర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా లో ప్రథానంగా ఫాహద్ ఫాజిల్ మరియు సునీల్‌ లు విలన్స్ గా నటించడం హైలైట్‌ గా నిలువబోతుంది. ఇక అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే రివీల్‌ చేసి అంచనాలు పెంచేశారు. అన్ని వర్గాల వారిని అన్ని భాషల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ట్రైలర్‌ చూస్తుంటే సినిమా విజయ్ దేవరకొండ అన్నట్లుగా నెక్ట్స్ లెవల్ అన్నట్లుగానే ఉందనిపిస్తుంది. మరి ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి.