Begin typing your search above and press return to search.

'పుష్ప' ఈవెంట్ లో బన్నీ ఫోన్ పోయిందా..?

By:  Tupaki Desk   |   8 April 2021 5:41 AM GMT
పుష్ప ఈవెంట్ లో బన్నీ ఫోన్ పోయిందా..?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న 'పుష్ప' ప్రమోషన్స్ నాలుగు నెలల ముందుగానే గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. 'పుష్ప రాజ్' పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ పెద్ద ఈవెంట్ చేశారు. ఈరోజు బన్నీ బర్త్ డే కావడంతో ఆ సెలబ్రేషన్స్ కి కూడా ఇదే వేదిక అయింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ 'ఐకాన్ స్టార్' అనే ట్యాగ్ లైన్ ని ఫ్యాన్స్ కి చేరవేశాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న బన్నీ.. 'పుష్ప' టీజర్ తో ఎలాంటి మూవీతో రాబోతున్నదీ చెప్పేశాడు. ఈ ఈవెంట్ సక్సెస్ అయినందుకు చిత్ర యూనిట్ - బన్నీ అభిమానులు హ్యాపీగా ఉన్నారు. అయితే 'పుష్ప రాజ్' పరిచయ వేడుకలో దురదృష్టవశాత్తు అల్లు అర్జున్ మొబైల్ ఫోన్ పోయిందని టాక్ వినిపిస్తోంది.

'పుష్ప' టీజర్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వచ్చారు. తమ అభిమాన హీరోని కలిసేందుకు ప్రయత్నిస్తూ కొందరు ముందుకు వచ్చి2బన్నీ ని చుట్టుముట్టారు. అయితే ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడంలో ఈవెంట్ మేనేజ్మెంట్ వారు, బౌన్సర్స్ ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలో అల్లు అర్జున్ తన మొబైల్ ని మిస్ చేసుకున్నారని అంటున్నారు. ప్రస్తుతానికైతే దీని గురించి బన్నీ టీమ్ నుంచి కంఫర్మేషన్ అయితే లేదు. ఇకపోతే ‘పుష్ప’ టీజర్‌ లాంజ్ ఈవెంట్‌ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ''ఇవాళ ఈ ఫంక్షన్‌ కి వచ్చి నన్ను ఇంత ప్రేమిస్తున్న ఫ్యాన్స్.. మై ఆర్మీకి చాలా పెద్ద థాంక్స్. ఇది కేవలం టీజర్ లాంచ్ ఈవెంట్ మాత్రమే కాదు.. నా పుట్టినరోజుని మీతో సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంతకంటే గొప్ప గిఫ్ట్ ఏమి ఉండదు'' అని సంతోషం వ్యక్తం చేశారు.