Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా కోసం బన్నీ పర్ఫెక్ట్ ప్లాన్..!
By: Tupaki Desk | 7 Aug 2021 7:00 AM ISTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ''పుష్ప''. ఇప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీలో సత్తా చాటిన బన్నీ.. ఈ సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ యాక్షన్ డ్రామాని తెరకెక్కిస్తున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెడుతున్న 'పుష్ప' టీమ్.. పాన్ ఇండియా స్థాయిలో సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ను ఆగస్టు 13న ఐదు భాషలలో విడుదల చేయనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను ఐదుగురు పాపులర్ సింగర్స్ తో పాడించడం విశేషం. ఈ పాటకు సంబంధించిన ప్రోమోలను మేకర్స్ ఒక్కొక్కటిగా వదులుతున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలుగు కంటే ముందుగా ఇతర భాషల సాంగ్ ప్రోమోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తున్నారు.
తెలుగులో అల్లు అర్జున్ కు ఎలాగూ క్రేజ్ ఉంది కాబట్టి.. ముందుగా ఇతర భాషల్లో 'పుష్ప' ఫస్ట్ సింగిల్ పై హైప్ క్రియేట్ చేయడానికి ఇలాంటి ప్లాన్ తో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళ వెర్షన్ ‘ఓడు ఓడు ఆడు’ ప్రోమోని యూనిట్ విడుదల చేసింది. బెన్నీ దయాల్ పాడిన ఈ పాటకు లిరిసిస్ట్ వివేక సాహిత్యం అందించారు. ఈ క్రమంలో ఇప్పుడు కన్నడ వెర్షన్ ‘జోక్కే జోక్కే మేకే’ ప్రోమోను వదిలారు. విజయ్ ప్రకాష్ ఆలపించిన ఈ సాంగ్ కు వరదరాజు లిరిక్స్ రాశారు.
'పుష్ప' ఫస్ట్ సాంగ్ మలయాళ మరియు హిందీ వెర్షన్ ల ప్రోమోలను రాబోయే రెండు రోజులలో విడుదల చేయనున్నారు. రాహుల్ నంబియార్ - విశాల్ దడ్లానీ ఈ వెర్షన్స్ ను పాడారు. ఇక చివరిగా శివమ్ పాడిన తెలుగు వెర్షన్ 'దాక్కో దాక్కో మేక' ప్రోమోని రిలీజ్ చేస్తారు. అల్లు అర్జున్ - సుకుమార్ ల ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రమోషన్స్ ను అదే లెవల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర భాషా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ద్వారా సినిమాకు పాన్ ఇండియా క్రేజ్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని అర్థం అవుతోంది.
ఇదిలా వుండగా 'దాక్కో దాక్కో మేక' కోసం మేకర్స్ దాదాపు 2 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఈ సాంగ్ విజువల్ గా కూడా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ ఉంది. 'ఆర్య' 'ఆర్య 2' వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ తర్వాత సుక్కూ - బన్నీ - దేవిశ్రీ కలయికలో వస్తున్న 'పుష్ప' ఆల్బమ్ కూడా అదే స్థాయిలో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
ఇకపోతే 'పుష్ప' చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ అనే మాస్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - 'తగ్గేదే లే' అంటూ వచ్చిన టీజర్ లో బన్నీ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ - జగపతిబాబు - సునీల్ - అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మిరోస్లా కుబా బ్రోజెక్ ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఆస్కార్ విన్నర్ రసూల్ పూకుట్టి ఈ చిత్రానికి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. 'పుష్ప' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ముత్యంశెట్టి మీడియా వారు నిర్మాణ బాగస్వాములుగా ఉన్నారు. ఇప్పటికే 'పుష్ప: ది రైజ్' చిత్రానికి సంబంధించిన మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేశారు. వీలైనంత త్వరగా మిగతా చిత్రీకరణ జరిపి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపనున్నారు.