Begin typing your search above and press return to search.

బన్నీ సినిమా రామ్ చేతికి.. రామ్ సినిమా వరుణ్ చేతికి..!

By:  Tupaki Desk   |   22 May 2021 6:00 AM IST
బన్నీ సినిమా రామ్ చేతికి.. రామ్ సినిమా వరుణ్ చేతికి..!
X
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం. ఒక స్టోరీ లైన్ సినిమాగా రూపంతరం చెంది ప్రేక్షకుల ముందుకు రావడానికి మధ్య ఎన్నో జరుగుతుంటాయి. కొన్ని సినిమాలు చర్చల దశలోనే మరికొన్ని సినిమాలు షూటింగ్ దశలో క్యాన్సిల్ అవుతుంటాయి. అలాంటి సందర్భాలలో ఆ ప్రాజెక్ట్స్ చేతులు మారుతుంటాయి. ఎవరితోనో అనుకున్న కథలు ఇంకెవరితోనో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ లో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ విషయంలో ఇదే జరుగుతోంది. రెండు ఆసక్తికర కాంబినేషన్స్ మారబోతున్నాయని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. 'పీఎస్వీ గరుడవేగ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు.. ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. ఇదొక మైనస్ 20 డిగ్రీస్ యాక్షన్ అడ్వెంచర్ అని.. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో చేస్తున్నందుకు ఎగ్జైటింగ్ గా ఉన్నానని రామ్ చెప్పుకొచ్చాడు. 2018లో ఈ ప్రాజెక్ట్ ని స్రవంతి బ్యానర్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఏమైందో ఏమో ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసారు. బడ్జెట్ ఎక్కువ అవుతుందేమోనని ఉద్దేశంతో ఈ సినిమాని క్యాన్సిల్ చేసారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రామ్ 'ఇస్మార్ట్ శంకర్' 'రెడ్' సినిమాలకు కమిట్ అవ్వడంతో ప్రవీణ్ సత్తారు సినిమా ఇక ఉండదని అందరికీ క్లారిటీ వచ్చింది.

అయితే ప్రస్తుతం 'కింగ్' అక్కినేని నాగార్జున తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్న ప్రవీణ్ సత్తారు.. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కు ఓ కథ వినిపించారట. స్టోరీ నచ్చడంతో వరుణ్ దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. ఈ కథ అప్పట్లో రామ్ కోసం సిద్ధం చేసిన యాక్షన్ అడ్వెంచరే అని టాక్ నడుస్తోంది. ఇది పక్కన పెడితే గతంలో తమిళ దర్శకుడు లింగుస్వామి తో అల్లు అర్జున్ ఓ బైలింగ్వల్ మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇటు బన్నీ అటు లింగుస్వామి వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో వీరి ఇంక ఆ ప్రాజెక్ట్ ని పూర్తిగా వదిలించుకున్నట్లే అనే కంక్లూజన్ కి వచ్చేశారు.

ఈ క్రమంలో ఇటీవల రామ్ పోతినేని - లింగుస్వామి కాంబినేషన్లో ఓ ద్విభాషా సినిమా ప్రారంభమైంది. అయితే లింగుస్వామి అప్పుడు అల్లు అర్జున్ తో చేయాల్సిన కథతోనే ఇప్పుడు రామ్ తో సినిమా చేస్తున్నాడని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు. దీని ప్రకారం బన్నీ నటించాల్సిన కథ రామ్ చేతికి వెళ్లగా.. అలాగే రామ్ కోసం రెడీ చేసిన కథ వరుణ్ తేజ్ చేతికి వెళ్లిందనే ప్రచారం జరుగుతోంది.