Begin typing your search above and press return to search.

పుష్ప స్మగ్లింగ్ అంతా.. తెలంగాణ జిల్లాలోనే..!!

By:  Tupaki Desk   |   6 July 2020 9:10 AM GMT
పుష్ప స్మగ్లింగ్ అంతా.. తెలంగాణ జిల్లాలోనే..!!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ కాస్త గ్యాప్ తీసుకుని తీస్తున్న సినిమా 'పుష్ప'. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక హీరో హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'పుష్ప' పోస్టర్ చూస్తే లెక్కల మాస్టర్ సుకుమార్ మరో ప్రయోగానికి తెరలేపాడని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమైపోతుంది. రాయలసీమ చిత్తూరు యాస, భాషతో పాటు బన్నీ ఊరమాసు మొరటు కుర్రాడిగా ఇరగదీస్తాడని అంటున్నారు. అడ‌వుల్లో గంధపు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా ఊర మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రంలో విజయ్ సేతుపతి అటవీశాఖ అధికారిగా నటిస్తున్నట్లు న్యూస్ బయటకి వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. స్మగ్లింగ్ సన్నివేశాలను మహబూబ్ నగర్ జిల్లాలోని అడవుల్లో షూట్ చేయనున్నారట. మిగిలిన సీన్స్ కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేయనున్నారట. అయితే ఫస్ట్ తక్కువ మందితో షూటింగ్ ప్రారంభించి ఓ షెడ్యూల్ పూర్తి చేస్తారట. ఈ షెడ్యూల్లో బన్నీ - రష్మిక లపై ఓ సాంగ్ కూడా షూట్ చేస్తారని సమాచారం. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఇందులో ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉందని.. అందులో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కాలు కదపనుందని తెలుస్తుంది. చూడాలి మరి పాన్ ఇండియా మూవీ ఎలా రూపొందిస్తారో.. అధికారిక ప్రకటన త్వరలో రానుంది.