Begin typing your search above and press return to search.
'పుష్ప' బెనిఫిట్ షోలు రద్దు.. థియేటర్లపై రాళ్లు రువ్విన ఫ్యాన్స్..!
By: Tupaki Desk | 17 Dec 2021 12:02 PM ISTఇప్పుడు ఎక్కడ చూసినా 'పుష్ప' గురించే మాట్లాడుకుంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రస్తుతం పుష్పరాజ్ మేనియా కొనసాగుతోంది. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ''పుష్ప: ది రైజ్'' భారీ అంచనాల నడుమ ఈరోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
'పుష్ప' సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ముందుగా ప్రకటించిన విధంగా బెనిఫిట్ షోలు పడకపోవడంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
‘పుష్ప’ సినిమా బెనిఫిట్ షో వేయకపోవడంతో అనంతపురం జిల్లా హిందూపురంలోని ఓ థియేటర్ ను ధ్వంసం చేసేందుకు బన్నీ ఫ్యాన్స్ ప్రయత్నించారు. బెనిఫిట్ షో కోసం శుక్రవారం ఉదయం సినిమా థియేటర్ వద్దకు వెళ్లిన అభిమానులకు.. షో క్యాన్సిల్ అయిందని తెలియడంతో నిరాశ ఎదురైంది. ఈ క్రమంలో కోపంతో థియేటర్ పై రాళ్లు విసిరారు.
థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో ప్రదర్శిస్తామని బోర్డు ఏర్పాటు చేసిందని.. ఒక్కొక్కరి నుంచి టికెట్ కు రూ. 500 డబ్బులు వసూలు చేసిందని అభిమానులు ఆరోపించారు. అయినా స్పెషల్ షో వేయకపోవడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఫ్యాన్స్ ని చెదరగొట్టి.. థియేటర్ గేట్లు మూసివేశారు.
అలానే కర్నూలు జిల్లాల్లోని ఆదోనిలో కూడా ఓ థియేటర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 'పుష్ప' బెనిఫిట్ షో వేయకపోవడంతో అల్లు అర్జున్ అభిమానులు థియేటర్ పై రాళ్లు రువ్వారు. అద్దాలు - బల్బులు వంటివి ధ్వంసం చేశారు. అదనపు షోలు వేయనందుకు ఏపీలో పలు చోట్ల ఇలాంటి ఘటనలు జరిగినట్లు సమాచారం.
కాగా, ఏపీలో బెనిఫిట్ షో లకు అవకాశం లేకుండా ప్రభుత్వం జీవో నెం.35 జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని న్యాయస్థానం రద్దు చేసింది. దీంతో అదనపు షోలు వేసుకునే అవకాశం ఉంటుందని పలువురు థియేటర్ యాజమాన్యాలు భావించారు.
ఈ క్రమంలో 'పుష్ప' బెనిఫిట్ షోలు వేస్తున్నట్లు కొన్ని థియేటర్లు ప్రకటించారు. అయితే హైకోర్టు తీర్పును ప్రభుత్వం సవాలు చేయడంతో.. విచారణ సోమవారానికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో థియేటర్లలో బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది.