Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : బన్నీ లవ్లీ బర్త్‌ డే సెలబ్రేషన్‌

By:  Tupaki Desk   |   8 April 2020 5:45 AM GMT
ఫొటోటాక్‌ : బన్నీ లవ్లీ బర్త్‌ డే సెలబ్రేషన్‌
X
అల్లు అర్జున్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న సుకుమార్‌ మూవీ టైటిల్‌ ఇంకా ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసిన విషయం తెల్సిందే. పుష్ప అనే టైటిల్‌ తో బన్నీ 20వ చిత్రం రూపొందుతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇదే సమయంలో అల్లు అర్జున్‌ పుట్టిన రోజు వేడుకకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. రాత్రి సమయంలో బన్నీతో స్నేహా ప్రత్యేకంగా కేక్‌ కట్‌ చేయించింది.

హోమ్‌ మేడ్‌ కేక్‌ ను బన్నీతో కట్‌ చేయించిన స్నేహా ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. స్నేహా చాలా రొమాంటిక్‌ గా బన్నీతో కేక్‌ కట్‌ చేయించడం ఇక్కడ చూడవచ్చు. కరోనా ఎఫెక్ట్‌ తో పార్టీలు వేడుకలు అన్నీ కూడా క్యాన్సిల్‌. దాంతో ఇంట్లోనే బన్నీకి ఇలా బర్త్‌ డే పార్టీని స్నేహా ఏర్పాటు చేసింది. ఇతరులు ఎవరు లేకున్నా కూడా భార్య స్నేహా తన బర్త్‌ డే వేడుక చేయడం తో బన్నీ మొహంలో ఆనందం చూడవచ్చు.

అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్బంగా ప్రతి ఏడాది కూడా ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కాని ఈసారి మాత్రం అవేవి లేకుండా బన్నీ బర్త్‌ డే సోషల్‌ మీడియాకే పరిమితం అయ్యింది. సోషల్‌ మీడియాలో బన్నీకి పెద్ద ఎత్తున బర్త్‌ డే విశెష్‌ చెబుతూ ఫ్యాన్స్‌ బన్నీ పుట్టిన రోజు హ్యాష్‌ ట్యాగ్‌ ను ట్రెండ్‌ చేస్తున్నారు.