Begin typing your search above and press return to search.

NTR30 ఓపెనింగ్ కు గెస్టుగా బన్నీ..?

By:  Tupaki Desk   |   31 Jan 2022 7:34 AM GMT
NTR30 ఓపెనింగ్ కు గెస్టుగా బన్నీ..?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది తారక్ కెరీర్ లో మైలురాయి 30వ చిత్రం. కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించనున్నారు. 2022 ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తారక్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఈ నేపథ్యంలో #NTR30 చిత్రాన్ని ఫిబ్రవరి 7వ తేదీన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారని సమాచారం. అంతేకాదు ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నారని తెలిసింది. నిజానికి కొరటాల తన తదుపరి సినిమా బన్నీతోనే చేయాల్సి ఉంది. అయితే 'పుష్ప' ఆలస్యం అవుతుండటం.. అదే సమయంలో త్రివిక్రమ్ - తారక్ కాంబోలో మూవీ క్యాన్సర్ అవడంతో.. ఎన్టీఆర్ - కొరటాల కలయికలో మరో చిత్రానికి శ్రీకారం చుట్టబడింది.

'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ - తారక్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ని ఖరారు చేసినట్లు సమావేశం. 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత అలియా తెలుగులో నటించే సినిమా ఇదే అవుతుంది.

అలానే తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ మరియు స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు NTR30 ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మూవీ ఓపెనింగ్ రోజు దీనికి సంబంధించిన విషయాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందించనున్నారు.