Begin typing your search above and press return to search.
కంగారూ ఆటగాడితో అల్లు అర్జున్ బంధం?
By: Tupaki Desk | 1 May 2020 9:30 AM ISTఅల్లు అర్జున్ - పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ తెరకెక్కించిన `అల వైకుంఠపురములో` ఇండస్ట్రీ రికార్డుల్ని కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. 2020 సంక్రాంతి బరిలో క్లీన్ విన్నర్ గా నిలిచింది ఈ మూవీ. అంతకుమించి ఈ సినిమాలో పాటలు ప్రజాదరణ పొందాయి. దేశ విదేశాల్లో అల.. పాటలకు ఏపాటి క్రేజు ఉందో సోషల్ మీడియా లైవ్ ల సాక్షిగా బయటపడింది. బన్ని ఫ్యాన్స్ ఈ పాటలకు డ్యాన్సులాడి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారంటే థమన్ మ్యూజిక్ ఏ రేంజులో వర్కవుటైందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ ప్రవాహం ఇప్పట్లో ఆగేట్టు లేదు. తాజాగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన కూతురితో కలిసి బుట్టబొమ్మ సాంగ్ కి స్టెప్పులేయడం ఆ వీడియో కాస్తా నిమిషాల్లోనే ప్రపంచ దేశాల్లో వైరల్ అయిపోవడం చూస్తుంటే అల.. లో ప్రభావం చూపించిన పాటల్ని ప్రశంసించకుండా ఉండలేం. వార్నర్ లాంటి ప్రముఖుడే తన పాటకు స్టెప్పులేయడంతో ఎంతో ఉబ్బితబ్బిబ్బయిన బన్ని ఆయనకు థాంక్స్ చెప్పాడు. రియల్లీ అప్రీషియేట్ ఇట్! అంటూ వార్నర్ కి సోషల్ మీడియాలో సందేశం పంపాడు.
డేవిడ్ వార్నర్ ఐపీఎల్ కీలక ఆటగాడు అన్న సంగతి తెలిసిందే. పైగా హైదరాబాద్ సన్ రైజర్స్ తరపున ఆడుతున్నాడు. అందుకే ఇలా లొకాలిటీ టచ్ ఉన్న పాటను ఎంపిక చేసుకుని సన్ రైజర్స్ యూనిఫాంతోనే స్టెప్పులేశాడన్నమాట. దానికి స్పందన అంతే అద్భుతంగా ఉంది. కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని ఇలాంటి చిత్రవిచిత్రాలు ఎన్నిటిని చూస్తామో! కానీ..!! అన్నట్టు బన్ని పాటలకు అటు బాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అతడి డ్యాన్సులపై హృతిక్ అంతటివాడే ప్రశంసలు కురిపించారు ఇంతకుముందు.