Begin typing your search above and press return to search.

వివాదం బాట‌లో బ‌న్నీ మ‌రో క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌

By:  Tupaki Desk   |   4 Feb 2022 10:36 AM GMT
వివాదం బాట‌లో బ‌న్నీ మ‌రో క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప‌` పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావడంతో మాంచి జోష్ మీదున్నాడు. సుకుమార్ తో ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి క‌లిసి చేసిన చిత్రం ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మార్చ‌డంతో బ‌న్నీ రెట్టించిన ఉత్సాహంతో సెల‌బ్రేష‌న్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఊహించ‌ని స్థాయిలో ఈ మూవీ రిక‌ర్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డ‌మే కాకుండా బ‌న్నీ క్రేజ్ ని కూడా అదే స్థాయిలో దేశ వ్యాప్తంగా వైర‌ల్ అయ్యేలా చేసింది.

ఈ సినిమా తెచ్చిన క్రేజ్ తో అల్లు అర్జున్ వ‌రుస క‌మ‌ర్షియ‌ల్ యాడ్ ల‌లో న‌టిస్తూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాడు. `పుష్ప‌` రిలీజ్ టైమ్ లో `రాపిడో` యాడ్ చేసి వివాదానికి తెర‌లేపారు. ఈ యాడ్ లో తెలంగాణ ఆర్టీసిని కించ‌ప‌రిచే స‌న్నివేశాలు, డైలాగ్ లు వున్నాయ‌ని వెంట‌నే వాటిని తొల‌గించాల‌ని తెలంగాణ ఆర్టీసి ఎండీ స‌జ్జ‌నార్ బ‌న్నీకి, రాపిడోకి నోటీసులు పంపించ‌డం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా బ‌న్నీ జొమాటో ఫుడ్ డెలివ‌రీ యాప్ కోసం ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ చేశారు.

ప్ర‌స్తుతం ఇది నెట్టింట వైర‌ల్ గా మారింది. అల్లు అర్జున్ జొమాటో యాప్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందు కోసం ఇటీవ‌లే భారీ ఒప్పందం కుదుర్చుకున్న బ‌న్నీ తాజాగా దీని కోసం ఓ టీవీ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ ని చేశారు. బ‌న్నీతో క‌లిసి ఈ యాడ్ లో న‌టుడు సుబ్బ‌రాజు కూడా న‌టించారు.

ఈ యాడ్ లో బ‌న్నీ సుబ్బ‌రాజు మ‌ధ్య ఫైట్ జ‌రుగుతున్న‌ట్టుగా చూపించారు.. త‌న‌ని ఎటాక్ చేయ‌డానికి వ‌చ్చిన సుబ్బ‌రాజుకి బ‌న్నీ పంచ్ ఇస్తాడు.. దీంతో సుబ్బ‌రాజు పేప‌ర్ల‌తో స‌హా గాల్లో తేలుతూ వుంటాడు..`బ‌న్నీ న‌న్ను కొంచెం తొంద‌ర‌గా కింద‌ప‌డేయ‌వా.. ` అని సుబ్బ‌రాజు అడిగితే.. `సౌత్ సినిమా క‌దా ఎక్కువ సేపు ఎగ‌రాలి.. అని బ‌న్నీ అన‌డం... `గోంగూర మ‌ట‌న్ తినాల‌ని వుంది.. కింద‌కి వ‌చ్చేలోపు రెస్టారెంట్ మూసేస్తారు..` అని సుబ్బ‌రాజు అంటుంటే ... గోంగూర మ‌ట‌న్ ఏంటీ ఎప్పుడు ఏది కావాల‌న్నా జొమాటో వుందిగా.. అంటూ బ‌న్నీ చెప్పిన డైలాగ్ లు సౌత్ సినిమాల‌పై పంచ్ వేస్తున్న‌ట్టుగా వున్నాయి.

గ‌తంలో రాపిడోతో వివాదంలో చిక్కుకున్న బ‌న్నీ ఇప్ప‌డు జొమాటో యాడ్ తోనూ మ‌రో వివాదానికి తెర‌లేపిన‌ట్టుగా చెబుతున్నారు. ఈ యాడ్ పై సౌత్ స్టార్స్, ఫిల్మ్ మేక‌ర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి అంటున్నారు సినీ ప్రియులు.