Begin typing your search above and press return to search.

బన్నీలో ఒక రచయిత కూడా ఉన్నాడు

By:  Tupaki Desk   |   1 May 2021 2:00 PM IST
బన్నీలో ఒక రచయిత కూడా ఉన్నాడు
X
అల్లు అర్జున్‌ మల్టీ ట్యాలెంటెడ్‌ అంటూ ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. కేవలం నటన మాత్రమే కాకుండా డాన్స్‌ ల్లో మరియు డైలాగ్‌ డెలవరీలో బన్నీ తనకు తానే సాటి అన్నట్లుగా అద్బుతమైన ప్రతిభను కనబర్చుతూ వస్తున్నాడు. బన్నీ లో కేవలం ఈ ప్రతిభలు మాత్రమే కాకుండా మంచి స్ర్ర్కీన్‌ ప్లే రచయిత మరియు ఒక డైలాగ్ రచయిత కూడా ఉన్నాడని ఆయనతో వర్క్‌ చేసిన వారు అంటూ ఉంటారు. సందర్బానుసారంగా బన్నీ డైలాగ్ లు మార్చుతూ చిత్ర యూనిట్‌ సభ్యులతో భలే ఉందే అనిపించుకుంటూ ఉంటాడట.

హీరోలు షూటింగ్‌ సమయంలో చిన్న చిన్న డైలాగ్‌ కరెక్షన్స్‌ చేబుతూ ఉంటారు. కాని బన్నీ మాత్రం తన డైలాగ్‌ తో ఏకంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ నే మెప్పించాడు. గురూజీ డైలాగ్ ను హీరోలు మార్చడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఆయన్ను మించి డైలాగ్‌ లు హీరోలకు ఐడియా రావడం కష్టమే. కాని అల వైకుంఠపురంలో సినిమా షూటింగ్‌ సమయంలో త్రివిక్రమ్‌ రాసిన డైలాగ్ ను బన్నీ మార్చాడట.

ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అల్లు అర్జున్‌ మరియు హర్ష వర్ధన్ ల కాంబోలో ఒక సన్నివేశంలో ఓ తరానికి మీరు ఇన్సిపిరేషన్‌.. అంటూ బుద్ది చెప్పే డైలాగ్‌ బాగా పండింది. ఆ డైలాగ్‌ చాలా లోతుగా గుచ్చుకుంటుంది. అంత బాగా పండిన డైలాగ్‌ అల్లు అర్జున్‌ ఐడియా అంటే చాలా మంది నమ్మక పోవచ్చు. కాని అది నిజమట. త్రివిక్రమ్‌ ఆ డైలాగ్‌ చోట మీరు చాలా గ్రేట్‌ సార్‌ అంటూ రాశాడు. కాని బన్నీ మాత్రం డైలాగ్ మార్చడం త్రివిక్రమ్‌ కూడా ఒప్పుకోవడం జరిగిందట. ఆ సంఘటనతో బన్నీ లో ఒక మంచి రచయిత కూడా ఉన్నాడని అభిమానులు అంటున్నారు.