Begin typing your search above and press return to search.

బిగ్​బాస్​ విన్నర్​కు బంపర్​ ఆఫర్​.. ప్రభాస్​ సినిమాలో చాన్స్​..!

By:  Tupaki Desk   |   17 May 2021 7:30 AM GMT
బిగ్​బాస్​ విన్నర్​కు బంపర్​ ఆఫర్​.. ప్రభాస్​ సినిమాలో చాన్స్​..!
X
యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్​.. రాముడిగా ఆదిపురుష్​ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్​డేట్స్​ కోసం ప్రభాస్​ ఫ్యాన్స్​ నిత్యం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్​డేట్​ ఇప్పుడు వచ్చింది. ఆదిపురుష్​ సినిమాలో బిగ్​బాస్​ సీజన్​ 13 విన్నర్​ సిద్ధార్థ్​ శుక్లా .. మేఘనాథుడి పాత్రలో మెప్పించబోతున్నారట. ఈ సినిమాలో ప్రభాస్​ రాముడిగా నటిస్తుండగా.. రావణాసురుడిగా సైఫ్​ అలీఖాన్​ మెప్పించబోతున్నారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి.

ఇక మేఘనాథుడు అంటే రావణాసురుడి కుమారుడు.. ఎంతో బలశాలి కూడా.. రామాయణంలో మేఘనాథుడు ఓ సందర్భంలో లక్ష్మణుడినే మట్టి కరిపిస్తాడు. అప్పుడు ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుడిని బతికిస్తాడు. ప్రస్తుతం మేఘనాథుడి పాత్రలో సిద్ధార్థ్​ శుక్లా కనిపించబోతున్నారట.

సిద్దార్థ్ ఇప్పటికే బాలీవుడ్ లో 2-3 సినిమాలు చేశాడు. కానీ అతడు బిగ్​బాస్​ షో తోనే పాపులర్​ అయ్యాడు. మరోవైపు ఆదిపురుష్​ షూటింగ్​ మరో 90 రోజులు పెండింగ్​లో ఉంది. ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్​ కనిపిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రభాస్​ కూడా వెయిట్​ చేస్తున్నాడు.అయితే లాక్​డౌన్​తో షూటింగ్​ నిలిచిపోయింది. ఈ సినిమా తర్వాతే సలార్​ షూటింగ్​ను ప్రారంభించనున్నాడు ప్రభాస్​. మరోవైపు ప్రభాస్​ నటిస్తున్న రాధేశ్యామ్​ విడుదలకు సిద్ధంగా ఉంది. మరి కొద్ది రోజుల వర్క్ మాత్రమే పెండింగ్ లో ఉంది. వీటితోపాటు నాగ్​అశ్విన్​తోనూ ఓ ప్రాజెక్టు చేయబోతున్నాడు ప్రభాస్​.