Begin typing your search above and press return to search.

బుల్లెట్ ట్రైన్.. ఏంజెలీనా జోలీ భర్త మరో సెన్సేషన్

By:  Tupaki Desk   |   6 Aug 2022 7:33 AM GMT
బుల్లెట్ ట్రైన్.. ఏంజెలీనా జోలీ భర్త మరో సెన్సేషన్
X
చాలా కాలం తరువాత హాలీవుడ్ లో మరో మంచి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటోంది. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ జానర్ తో సంబంధం లేకుండా ఆదరిస్తారని రుజువవుతూనే ఉంది. ఇక ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నటుడు బ్రాడ్ పిట్ మరో సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. అతను సినిమా చేసేందుకు కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నప్పటికి పవర్ఫుల్ కంటెంట్ తో వచ్చాడు.

అతని నుంచి ఇటీవల వచ్చిన యాక్షన్-కామెడీ చిత్రం 'బుల్లెట్ ట్రైన్' మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా కోసం మూడేళ్ళ సమయాన్ని తీసుకోగా ఫైనల్ గా ఆగస్ట్ 4న గురువారం విడుదలైంది.

ఫైనల్ గా నటుడు మరోసారి పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో మెప్పించాడు. అలాగే అందులోనే కామెడీ యాంగిల్ కూడా హైలెట్ అయ్యింది. నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్‌తో వచ్చిన ఈ కామెడీ యాక్షన్ రైడ్‌ మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఇంతకుముందు ట్రాయ్, మిస్టర్ & మిసెస్ స్మిత్ వంటి బ్లాక్ బస్టర్ అవార్డ్ విన్నింగ్ సినిమాలలో ఈ టాలెంటెడ్ నటుడు తన మార్కెట్ వాల్యుని పెంచుకున్నాడు. అందులో అతని భార్య మోస్ట్ గ్లామరస్ బ్యూటీ ఏంజెలీనా జోలీ నటించిన విషయం తెలిసిందే.

ఇదివరకే అతను అకాడమీ అవార్డును సొంతం చేసుకున్నాడు. క్వెంటిన్ టరాన్టినో వన్స్ అపాన్ ఎ టైమ్‌లో అకాడమీ అవార్డు గెలుచుకొని తన భార్యకు అంకితమిచ్చాడు. హాలీవుడ్‌లో లియోనార్డో డికాప్రియో కూడా అతనితో పాటు అకాడమీ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.

ఇక లేటెస్ట్ మూవీ బుల్లెట్ ట్రైన్‌ తో మరోసారి అదే తరహాలో మ్యాజిక్‌ను క్రియేట్ చేసి ఈ నటుడు మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ బిగ్ బడ్జెట్ మూవీతో బ్రాడ్ పిట్ నటన కూడా హైలెట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రం పూర్తిగా థ్రిల్లింగ్‌గా కామెడి మూవీగా ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. డెడ్‌పూల్ 2 దర్శకుడు డేవిడ్ లీచ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం కోటారో ఇసాకా యొక్క బెస్ట్ సెల్లర్ అండ్ బీటిల్ ఆధారంగా తెరపైకి తీసుకు వచ్చారు.