Begin typing your search above and press return to search.

'బుల్ బుల్ తరంగ్' ప్రోమో: మాస్ రాజా కోసం సిద్ శ్రీరామ్ ఆన్ డ్యూటీ..!

By:  Tupaki Desk   |   9 April 2022 11:45 AM GMT
బుల్ బుల్ తరంగ్ ప్రోమో: మాస్ రాజా కోసం సిద్ శ్రీరామ్ ఆన్ డ్యూటీ..!
X
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ''రామారావు ఆన్ డ్యూటీ''. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో దివ్యాంశ కౌశిక్ - రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా 'రామారావు ఆన్ డ్యూటీ' లోని ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.

'బుల్ బుల్ తరంగ్' అనే పాటను రేపు ఆదివారం (ఏప్రిల్ 10) ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా సాంగ్ ప్రోమోని సోషల్ మీడియా మాధ్యమాలలో రిలీజ్ చేశారు.

'బుల్ బుల్ తరంగ్ బుల్ బుల్ తరంగ్ లోకం మోగేను.. లవబ్ డబ్ మాని నీ పేరై మోగేను..' అంటూ సాగిన ఈ గీతం అలరిస్తోంది. సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ స్వరపరిచిన ఈ మెలోడీకి రాకేందు మౌళి లిరిక్స్ రాసారు. సింగర్ సిద్ శ్రీరామ్ మరోసారి తన వాయిస్ తో మ్యూజిక్ చేశారు.

రవితేజ - రజిషా విజయన్ పై చిత్రీకరించిన ఈ రొమాంటిక్ లవ్లీ సాంగ్ విజువల్ కూడా బాగుంది. ఫారిన్ డ్యాన్సర్లతో స్పెయిన్‌ లో ఈ పాటని చిత్రీకరించారు. రవితేజ స్టైలిష్ గా, హ్యాండ్సమ్ గా ఉండగా.. రజిషా హాఫ్ సారీలో ఎంతో బ్యూటీఫుల్ గా కనిపిస్తోంది.

ప్రధాన జోడీ మధ్య కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. మెడలో స్కార్ప్ వేసుకొని మాస్ రాజా వేసిన సింపుల్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన 'రామారావు..' పోస్టర్‌లు - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. రేపు రాబోయే 'బుల్ బుల్ తరంగ్' ఫుల్ సాంగ్ ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.

వాస్తవ సంఘటనల ఆధారంగా స్పెషల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్ గా కనిపించనున్నారు. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తుండగా.. నాజర్ - నరేష్ - పవిత్ర లోకేష్ - తనికెళ్ళ భరణి - రాహుల్ రామకృష్ణ - 'ఈరోజుల్లో' శ్రీ - 'సర్పట్ట' జాన్ విజయ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది. సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి.. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాన్ని జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.