Begin typing your search above and press return to search.

కెజిఎఫ్ 2 రేంజ్ వంద కోట్లా ?

By:  Tupaki Desk   |   15 May 2019 6:19 AM GMT
కెజిఎఫ్ 2 రేంజ్ వంద కోట్లా ?
X
గత ఏడాది డిసెంబర్ లో విడుదలై భాషతో సంబంధం లేకుండా అనూహ్యంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచిన కెజిఎఫ్ కు కొనసాగింపు చాప్టర్ 2 షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. చాలా పరిమితులు ఉండే శాండల్ వుడ్ మార్కెట్ ని ఏకంగా రెండు వందల కోట్ల స్థాయికి వెళ్లేలా చేసిన ఘనత దీనికే దక్కుతుంది.

ఇప్పటిదాకా నార్త్ లో ఏ కన్నడ సినిమా ఆడని రేంజ్ లో కెజిఎఫ్ వసూళ్లు దక్కించుకోవడం ఇప్పటికీ అనూహ్యమైన రికార్డుగానే చెప్పుకోవాలి. ఇదిలా ఉండగా కెజిఎఫ్ 2 బడ్జెట్ అమాంతంగా ఏకంగా వంద కోట్ల దాకా పెంచినట్టు బెంగుళూరు టాక్. ఇప్పటిదాకా ఏ మూవీ అక్కడ ఇంత భారీ ఎత్తున నిర్మాణం జరగలేదు

ఫస్ట్ పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండో భాగానికి చాలా మార్పులు చేసినట్టు తెలిసింది. రేంజ్ పెరిగిపోయింది కాబట్టి రెట్టింపు స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉండేలా ప్లాన్ చేశారట. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ లొకేషన్స్ లో షూటింగ్ కోసం యష్ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు.

కెజిఎఫ్ గనులను తన ఆధీనంలోకి తీసుకున్నాక రాఖీ భాయ్ దేశ మాఫియాని శాశించే స్థాయికి ఎదిగి ప్రధాన మంత్రే తన మీద ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చే లెవెల్ కి ఎలా చేరుకున్నాడు అనే పాయింట్ మీద చాప్టర్ 2 రూపొందింది. సంజయ్ దత్ రవీనాటాండన్ లాంటి సీనియర్ బాలీవుడ్ తారలు నటిస్తున్నారన్న టాక్ ఉంది యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు