Begin typing your search above and press return to search.

ద‌ర్బార్ కి అంత బ‌డ్జెట్.. పెద్ద సాహ‌స‌మే!

By:  Tupaki Desk   |   9 Nov 2019 5:32 AM GMT
ద‌ర్బార్ కి అంత బ‌డ్జెట్.. పెద్ద సాహ‌స‌మే!
X
అవునా.. ఇది నిజ‌మా? సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ క‌థానాయ‌కుడి గా ఏ.ఆర్.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా బ‌డ్జెట్ ఎంత‌? ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఏ స్థాయి లో వ‌సూళ్లు తేవాలి? అంటే .. క్రిటిక్ ఎనాలిసిస్ చెబుతున్న లెక్క‌లు షాకిస్తున్నాయి. ఈ సినిమా కి ఏకంగా 130 కోట్ల బ‌డ్జెట్.. ఆపై 80 కోట్ల మేర ర‌జ‌నీ పారితోషికం చెల్లించాల్సి ఉంటుంద‌న్న‌ది ఓ విశ్లేష‌ణ‌.

అంటే ఆల్మోస్ట్ బాహుబ‌లి -1 కోసం ఆర్కా మీడియా సంస్థ ఖ‌ర్చు చేసినంత చేయాల్సిందేన‌న్న‌మాట‌. అయితే రిట‌ర్నులు ఆ రేంజు లో తేలేక‌ పోతేనే లైకా సంస్థ‌ పై ఆ మేర‌కు పంచ్ ప‌డుతుంద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. ర‌జ‌నీతో 2.0 లాంటి భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన లైకా సంస్థ కు ఇంత‌కు ముందే బిగ్ పంచ్ ప‌డింది. అయినా మొండి గా మ‌రో సారి ర‌జ‌నీ పై ఇంత పెద్ద‌ బ‌డ్జెట్ పెడుతోందా? మురుగ‌ దాస్ ఆ బ‌డ్జెట్ కి త‌గ్గ‌ట్టు న్యాయం చేస్తున్నారా? అంటూ ఆస‌క్తి క‌ర చ‌ర్చ సాగుతోంది. ఒక‌ వేళ ఇంత బ‌డ్జెట్ నిజ‌మే అయితే బాహుబ‌లి రేంజు హిట్ట‌వుతుందా? అన్న‌ది చూస్తే ఇంపాజిబుల్. దాదాపు 250 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించిన బాహుబ‌లి ప్ర‌పంచ‌ వ్యాప్తంగా 600 కోట్లు వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. అయితే ఆ సినిమా తో ద‌ర్బార్ ని పోల్చ‌లేం. ఇదో రెగ్యుల‌ర్ క్రైమ్ డ్రామా. కాప్ రోల్ కీల‌క భూమిక పోషిస్తోంది. అంటే ఒక వారియ‌స్ సినిమా మైలేజ్ దీనికి వ‌చ్చే ఛాన్సే లేదు. ర‌జ‌నీ బ్రాండ్.. మురుగ బ్రాండ్.. లైకా బ్రాండ్ ఉన్నా ఇదో పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి.

ఇక ర‌జ‌నీ న‌టించిన సినిమాల్లో 2.0 త‌ప్ప‌ ఇంత‌వ‌ర‌కూ ఏదీ 200 కోట్ల షేర్ మార్క్ ని దాట‌లేదు. దీంతో ద‌ర్బార్ ముందు భారీ స‌వాల్ ఉంద‌నే అర్థ‌ మ‌వుతోంది. ఈ చిత్రం తెలుగు - త‌మిళం-హిందీలో 2020 జ‌న‌వ‌రి 9న రిలీజ‌వుతోంది. ఇందులో న‌య‌న‌ తార క‌థా నాయిక‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం లో ర‌జ‌నీ మార్క్ పోలీసు ని చూడ‌బోతున్నామ‌ని ఇప్ప‌టికే రిలీజైన పోస్ట‌ర్లు.. మోష‌న్ పోస్ట‌ర్ చెబుతున్నాయి. ముంబై నేప‌థ్యం లో సౌత్ డీజీపీ ఆఫీస‌ర్ ఆప‌రేష‌న్ ఏమిట‌న్న‌ది మురుగ‌ దాస్ తెర‌పై చూపిస్తున్నారు. అయితే లైకా సంస్థ ద‌ర్భార్ పై అంత పెద్ద పెట్టుబ‌డి పెట్ట‌డానికి కార‌ణం త‌మిళ మార్కెట్ తో పాటు మ‌లేషియా మార్కెట్ ఓ కార‌ణం అన్న మాటా వినిపిస్తోంది.