Begin typing your search above and press return to search.

'బబ్లీ బౌన్సర్' తమన్నా రెడీ.. ఇదేదో కొత్తగా ఉందే!

By:  Tupaki Desk   |   20 July 2022 7:30 AM GMT
బబ్లీ బౌన్సర్ తమన్నా రెడీ.. ఇదేదో కొత్తగా ఉందే!
X
మిల్కీ బ్యూటీగా తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న తమన్నా ఇటీవల కాలంలో అగ్ర హీరోలతో అనుకున్నంతగా అవకాశాలు అందుకోవడం లేదు. ఇక ప్రస్తుతం ఆమె ఫోకస్ ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలపై పడింది. సినిమాలలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేయాలని కూడా తమన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు అర్థం అవుతుంది.

ఇక త్వరలోనే ఒక సరికొత్త కాన్సెప్ట్ తో రూపొందుతున్న ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటివరకు ఎవరు కూడా పెద్దగా ట్రై చేయని బౌన్సర్ తరహా కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల కాలంలో స్టార్ సెలబ్రిటీలకు ప్రత్యేకంగా సెక్యూరిటీగా బౌన్సర్స్ ఉంటున్న విషయం తెలిసిందే. అయితే అందులో ఎక్కువగా మగవాళ్ళు ఉంటుంటారు.

కానీ ఈసారి ఒక అమ్మాయి ఉంటే ఎలా ఉంటుంది. ఇక అందులో కూడా అందమైన అమ్మాయి మరింత పవర్ఫుల్గా కనిపిస్తే ఏ విధంగా ఉంటుంది అనే తరహాలో ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. దర్శకుడు మధుర్ భండార్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇక బాబ్లీ బౌన్సర్ 23 సెప్టెంబర్ 2022న డిస్నీ+ హాట్‌స్టార్‌లో హిందీ, తమిళం మరియు తెలుగులో విడుదల కానుంది. ఇక తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది.

నార్త్ ఇండియాలో నిజమైన 'బౌన్సర్ టౌన్' బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఒక కామెడీ డ్రామాగా ఈ సినిమా రానుందట. అసోలా ఫతేపూర్ గా తమన్నా భాటియాను బాబ్లీ బౌన్సర్‌గా మునుపెన్నడూ చూడని లోక్ చూస్తారట.

ఇక సౌరభ్ శుక్లా, అభిషేక్ బజాజ్ మరియు సాహిల్ వైద్ కీలక పాత్రలలో నటించారు. అయితే మొదట ఈ సినిమాను థియేటర్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ హాట్ స్టార్ నుంచి మంచి ఆఫర్ రావడంతో అందులోనే విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి ఈ సినిమాతో తమన్నా ఎలాంటి గుర్తింపును అందుకుంటుందో చూడాలి.