Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బిల్లా బ్యూటి బికినీలో..

By:  Tupaki Desk   |   28 Feb 2017 7:19 PM GMT
ఫోటో స్టోరి: బిల్లా బ్యూటి బికినీలో..
X
మన దేశంలో కేవలం మన భామలు మాత్రమే కాదు.. ఫారిన్ భామలు కూడా అనేకమంది మోడలింగ్ మరియు సినిమాల్లో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వారిలో యామీ జాక్సన్ వంటి భామలు స్టార్ హీరోయిన్లు అయితే.. నోరా ఫతేహి.. స్కార్లెట్ మెలిష్‌ విల్సన్.. నికోల్ యామీ మాడెల్.. ఫరా కరిమి వంటి భామలు మంచి ఐటెం పాపలుగా సెట్టయిపోయారు. ఇక అనేకమంది మన యాడ్స్ లో మోడల్స్ గా.. సాంగ్స్ లో డ్యాన్సర్స్ గా నటిస్తున్నారు.

ఇదే కోవలో బ్రెజిలియన్ బ్యూటి బ్రూనా అబ్దుల్లా కూడా ఇండియాలో తెగ రెచ్చిపోతోంది. అమ్మడు చాలా బాలీవుడ్ సినిమాల్లో కనిపించింది కాని బ్రేక్ మాత్రం రాలేదు. అయితే సౌత్ లో అజిత్ హీరోగా చేసిన బిల్లా 2 సినిమాలో ఒక రోల్లో నటించింది. బికినీ సొగసులతో పాటు కావల్సినంత గ్లామర్ ను సమర్పించుకుంది. కాని ఏం లాభం.. ఇక్కడ పెద్దగా అవకాశాలు పట్టలేక.. మళ్ళీ బాలీవుడ్ లోనే అలా అలా పబ్బం గడిపేస్తోంది.

ఇప్పుడిక అమ్మడు బీచ్ లో తన అందాలతో మత్తెక్కిస్తోంది. తన మాతృదేశం బ్రెజిల్ లో సమ్మర్ కావడంతో.. అక్కడి కపావ్ డా కనోవా బీచ్లో అమ్మడు స్నేహితులు మరియు ఫ్యామిలీతో కలసి ఫుల్లుగా సెలబ్రేట్ చేసుకుంటోంది బ్రూనా. రెండు చిన్న చిన్న పీలికల్లో అమ్మడి అందాలను ఆస్వాదిస్తున్న ఆ బీచ్ ఎంత అదృష్టం చేసుకుందో కదూ!!