Begin typing your search above and press return to search.

బ్ర‌ద‌ర్ ఆఫ్ స‌న్నీ ల‌వ్ స్టోరి ఇంట్రెస్టింగ్ గురూ

By:  Tupaki Desk   |   4 Jun 2021 5:00 PM IST
బ్ర‌ద‌ర్ ఆఫ్ స‌న్నీ ల‌వ్ స్టోరి ఇంట్రెస్టింగ్ గురూ
X
శృంగార తార స‌న్నీలియోన్ కెన‌డా- అమెరికాలో ప‌లు ఫిలిం స్టూడియోల‌తో క‌లిసి ప‌ని చేసిన సంగతి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే స‌న్నీ శృంగార చిత్రాల నాయ‌కిగా ఎదిగింది. కాల‌క్ర‌మంలో డేనియ‌ల్ వెబర్ ని పెళ్లాడిన స‌న్నీ బాలీవుడ్ లో క‌థానాయిక‌గా రాణించింది. ఇక్క‌డే ప‌లువురు పిల్ల‌ల్ని ద‌త్త‌త తీసుకుని స‌రోగ‌సి విధానంలోనూ క‌ని పెంచుతున్న సంగ‌తి తెలిసిందే.

స‌న్నీలియోన్ కి ఒక సోద‌రుడు ఉన్నారు. సుందీప్ వోహ్రా అత‌డి పేరు. వోహ్రా.. క‌రిష్మా నాయుడుని పెళ్లాడారు. క‌రిష్మా ముంబై అమెరికాలో పెద్ద రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్. బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి. స‌న్నీకి ప‌ర్స‌న‌ల్ స్టైలిష్ట్ గానూ ప‌నిచేశారు. అయితే స‌న్నీ వ‌ల్ల త‌న సోద‌రుడు వోహ్రాకి క‌రిష్మా ప‌రిచ‌యం అయ్యారు. త‌న‌కోస‌మే అత‌డు విదేశాల నుంచి ముంబైకి వ‌చ్చాడ‌ట‌. అలా ఆ ఇద్ద‌రి ప్రేమ ఫ‌లించి 2016లో పెళ్లాడారు. ఆమె ఇప్పుడు 29 వారాల గర్భవతి. త‌న బేబి బంప్ ఫోటోలు ఇప్ప‌టికే వైర‌ల్ అవుతున్నాయి.

కరిష్మా నాయుడు ఫ్యాషన్ స్టైలిస్ట్.. వార్డ్రోబ్ కన్సల్టెంట్ కూడా. ఆమెకు ఇన్ స్టాలో 42 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె వెబ్ సైట్ ప్రకారం కరిష్మా `కె రియల్ ఎస్టేట్`ని ర‌న్ చేస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో ఏరియా లో ప్రత్యేకత కలిగిన ప్రాపర్టీ ఏజెంట్. కరిష్మాకు రెండు ఇన్ స్టా ఖాతాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తిగతమైనది . మరొకటి ఫ్యాషన్ విత్ కే. తన రోజువారీ దుస్తులను ఫ్యాషన్ చిట్కాలను ఇందులో ప్రదర్శిస్తారు. క‌రిష్మా వివాహానికి ముందు ప‌లువురు బాలీవుడ్ స్టార్ల‌తో క‌లిసి ప‌ని చేశారు.

ఇక స‌న్నీ సోద‌రునితో ప‌రిచ‌యం తన జీవితాన్ని మార్చివేసింది. సన్నీ సోదరుడు సుందీప్ ఒక వానిటీ వ్యాన్ లో సన్నీని స్టైలింగ్ చేస్తున్నప్పుడు వీడియో కాల్ లో ఆమెను మొదటిసారి చూశార‌ట‌. ఆమెను కలవడానికి లాస్ ఏంజెల్స్ నుంచి అత‌డు ముంబైకి వెళ్లాడు. ఆ త‌ర్వాత క‌లిసి షికార్ల‌తో పాటు పెళ్లి వ్య‌వ‌హారం తో ప్రేమ‌క‌థ సుఖాంత‌మైంది.