Begin typing your search above and press return to search.

నా జీవితం సెక్స్ బానిస‌ క‌న్నా దారుణంః బ్రిట్నీ స్పియ‌ర్స్‌

By:  Tupaki Desk   |   24 Jun 2021 2:17 PM GMT
నా జీవితం సెక్స్ బానిస‌ క‌న్నా దారుణంః బ్రిట్నీ స్పియ‌ర్స్‌
X
ఈ భూమ్మీద పుట్టిన ప్ర‌తి మ‌నిషికీ స్వేచ్ఛ ప్రాథ‌మిక హ‌క్కు. స్వ‌తంత్రం జ‌న్మ హ‌క్కు. ఈ రెండు హ‌క్కులు ఎవ‌రి కంట్రోల్ లోనే ఉండిపోతే? మ‌న రిమోట్ వేరే ఎవ‌రి చేతిలోనే ఉంటే..? జీవితం ఎలా సాగుతుంది? టెడ్డీ బేర్ కు ఎక్కువ.. రోబోకు తక్కువ అన్న చందంగా మారిపోతుంది. దాదాపు 13 సంవ‌త్స‌రాలుగా ఇదే త‌ర‌హా జీవితం అనుభ‌విస్తున్నాని సాక్షాత్తూ న్యాయ‌మూర్తి ఎదుట క‌న్నీటి ప‌ర్యంత‌మైంది ప్ర‌ముఖ పాప్ సింగ‌ర్ బ్రిట్నీ స్పియ‌ర్స్‌.

పాప్ స్టార్ గా బ్రిట్నీ రేంజ్ ఏంట‌నేది స‌గ‌టు సంగీత అభిమానికి తెలిసిందే. త‌న గాత్రంతో ప్ర‌పంచాన్ని ఉర్రూత‌లూగించే బ్రిట్నీ.. నిజ జీవితంలో మాత్రం గొంతు మూగ‌బోయిన దానిలా బ‌తుకుతున్నాన‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌న జీవితంలో తండ్రే విల‌న్ అని, అర్జెంటుగా గార్డియ‌న్ పోస్టునుంచి తొల‌గించాల‌ని ప్రాథేయ‌ప‌డింది.

అస‌లు విష‌యం ఏమంటే.. గ‌తంలో బ్రిట్నీ స్పియ‌ర్స్ ప‌లు శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్య స‌మ‌స్య‌లు రావ‌డంతో.. ఆమెకు సంబంధించిన ప్ర‌తీ విష‌యం తండ్రి చూసుకోవాల‌ని కోర్టు ఆదేశించింది. దీన్ని ‘కన్సర్వేటర్ షిప్’ అని పిలుస్తారు. దీనివ‌ల్ల ఆమె పెళ్లి చేసుకోవ‌డం.. పిల్ల‌ల్ని క‌న‌డ‌మే కాదు.. ఏ ప‌ని చేయాల‌న్నా తండ్రి అనుమ‌తి ఉండాల్సిందే.

ఈ హ‌క్కును అడ్డుపెట్టుకొని త‌న‌ను నానా విధాలుగా ఇబ్బంది పెట్టాడ‌ని కోర్టు ముందు బోరును విల‌పించింది బ్రిట్నీ. త‌న జీవితం మొత్తం నాశ‌నం చేశాడ‌ని, త‌న తండ్రి చెర నుంచి విడిపించాల‌ని కోరింది. ఆయ‌న‌కు క‌ల్పించిన హ‌క్కును ర‌ద్దు చేయాల‌ని కోర్టును వేడుకుంది.

త‌న‌కు ఇష్టం లేక‌పోయినా.. ఆయ‌న చెప్పిన ప‌నుల‌న్నీ చేయాల్సి వ‌చ్చింద‌ని, తాను సంపాదించిన డ‌బ్బు మొత్తం ఆయనే అనుభ‌వించాడ‌ని చెప్పింది. త‌న సంపాద‌న‌లో ఒక్క శాతం కూడా త‌న‌కు ఇవ్వ‌లేద‌ని తెలిపింది. చివ‌ర‌కు త‌న ఫోన్ కూడా ఆయ‌న కంట్రోల్ లోనే ఉండ‌ద‌ని చెప్పిన బ్రిట్నీ.. త‌న‌కు మ‌ళ్లీ పెళ్లి చేసుకోవాల‌ని ఉన్నా అంగీక‌రించ‌లేద‌ని చెప్పింది. ఇది సెక్స్ బానిస‌త్వంతో స‌మాన‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా బ్రిట్నీకి ఫ్యాన్స్ మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఆమె జీవితాన్ని అడ్డుకోవ‌డానికి ఎవ్వ‌రికీ హ‌క్కులేద‌ని అంటున్నారు. మ‌రి, కోర్టు ఎలా స్పందిస్తున్న‌ది చూడాలి.