Begin typing your search above and press return to search.

చిరు-స‌ల్మాన్ కోసం బ్రిట్నీస్పియ‌ర్ బ‌రిలోకి?

By:  Tupaki Desk   |   12 Nov 2021 3:29 AM GMT
చిరు-స‌ల్మాన్ కోసం బ్రిట్నీస్పియ‌ర్ బ‌రిలోకి?
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడు మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ `లూసీఫ‌ర్` తెలుగులో రీమేక‌వుతున్న సంగ‌తి తెలిసిందే. `గాడ్ ఫాద‌ర్` టైటిల్ తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా సెట్స్ పై ఉంది. చాలా భాగం షూటింగ్ కూడా పూర్త‌యింది. స్క్రిప్ట్ డిమాండ్ మేర‌కు `గాడ్ ఫాద‌ర్` లో భారీ తార‌గ‌ణాన్ని రంగంలోకి దించారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. మ‌రి ఇందులో స‌ల్మాన్ పాత్ర ఫ‌రిది ఎలా ఉంటుంది? అన్న‌ది ప‌క్క‌నబెడితే చిరంజీవితో స‌ల్మాన్ భాయ్ స్టెప్పులు వేయ‌డం మాత్రం ఖ‌రారైంది.

ఈ విష‌యాన్ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ క‌న్ఫ‌మ్ చేసారు. మ‌రి ఇలా ఇద్ద‌రు బిగ్ స్టార్స్ క‌లిసి తెర‌ను పంచుకోవ‌డం ఒక ఎత్త‌యితే...ఇద్దరూ క‌లిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ నంబ‌ర్ ని ప్ర‌త్యేకంగా డిజైన్ చేయాలి. టాప్ స్టార్లు పేరున్న సెల‌బ్రిటీని బ‌రిలో దించా సింగ‌ర్ల‌ని సైతం దించాలిగా. థ‌మ‌న్ స‌రిగ్గా అదే ప్లాన్ చేసారు. చిరంజీవి-స‌ల్మాన్ తొలిసారి తెర‌ను పంచుకోవ‌డంతో ఏకంగా హాలీవుడ్ ఫేమ‌స్ సింగ‌ర్ బ్రిట్నీ స్పియ‌ర్ నే దించ‌డానికి కే రెడీ అయ్యారు.

``చిరంజీవి.. స‌ల్మాన్ సార్ డాన్సు చేస్తున్నారంటే ఆ పాట ఎంతో ప్ర‌త్యేకంగా ఉండాలి. ఇది నాకు చాలా పెద్ద విష‌యం. ఎంతో బాధ్య‌త తో కూడుకున్న ప‌ని. నామీద న‌మ్మ‌కం తో వాళ్లిద్ద‌రు క‌లిసి డాన్సు చేయ‌డానికి వ‌స్తున్నారంటే? నేను ఎంత కేర్ ఫుల్ గా ఉండాలో అర్ధ‌మ‌వుతుంది. ఆ పాట చాలా స్పెష‌ల్ గా ఉండాలి. అందుకే హాలీవుడ్ సింగర్ బ్రిట్నీ స్పియ‌ర్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాం. ఇంకా ఖ‌రారు కాలేదు. పెద్ద సింగర్ తోనే ఆ పాట పాడిస్తే బాగుంటుంద‌ని డిసైడ్ అయ్యా. ఆ ర‌కంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం. అంతర్జాతీయ ఆడియో కంపెనీలో మాట్లాడుతున్నాం. బ్రిట్నీ స్పియ‌ర్ కొన్ని ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీల‌తో ఒప్ప‌దంం చేసుకుని ఉన్నారు. అందుకే ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నా``మ‌ని థ‌మ‌న్ తెలిపారు.