Begin typing your search above and press return to search.

చీకటి రాత్రులే.. ఈ అందాల తారను క్రియేట్ చేశాయేమో..!

By:  Tupaki Desk   |   14 May 2020 7:50 AM GMT
చీకటి రాత్రులే.. ఈ అందాల తారను క్రియేట్ చేశాయేమో..!
X
పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు కుర్రకారు మనసులు కొల్లగొట్టింది ఈ పంజాబీ బ్యూటీ. ముఖ్యంగా ఆర్ఎక్స్100 సినిమాలో తన అందాల ఆరబోతతో.. బోల్డ్ క్యారెక్టర్ లో ఒదిగిపోయి పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇటీవలే వెంకీ మామ సినిమాలో వెంకటేష్ తో ఆడిపాడినా ఎందుకో క్రేజ్ రాలేదు. ఇక డిస్కోరాజా, RDX లవ్ లాంటి సినిమాలు ఇలా వచ్చి ప్లాప్ అయి అలా వెళ్లిపోయాయి. దాంతో ఎలాగైనా ఇక్కడ క్రేజ్ తెచ్చుకోవాలని గట్టిగానే ట్రై చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా ఇటీవలే తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా పెద్ద షాక్ ఇచ్చింది. నాకు బాయ్ ఫ్రెండ్‌ ఉన్నాడు.. అని తన బాయ్ ఫ్రెండ్ ని ఫ్యాన్స్ కి పరిచయం చేసి కుర్రాళ్ళ గుండెల్ని బ్రేక్ చేసింది.

ఉదయాన్నే అందమైన పరువాలను సోషల్ మీడియాలో పరిచింది పాయల్. ఎవరైనా లేవగానే కొత్తదనాన్ని చూడాలని కోరుకుంటే మాత్రం మనం పాయల్ రాజ్ పుత్ కి థాంక్స్ చెప్పాలి. ఈ రోజు ఉదయం లేవగానే దిగిన ఓ అందమైన ఫోజును పాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోతో పాటు "చీకటి రాత్రులే ప్రకాశవంతమైన తారలను క్రియేట్ చేస్తాయి" అంటూ ట్యాగ్ లైన్ కూడా రాసింది. ఇక ఈ పోజులో పాయల్ చూసినవారంతా పాయల్ చాలా ప్రశాంతంగా.. తన అందమైన ఒంపుసొంపులను కన్నులకు ఇంపుగా నిలుపుతుందని.. అన్పిస్తుంది అంటూ తెలుపుతున్నారు. పొద్దుపొద్దున లేవగానే తన అందాలతో అభిమానులను బాధిస్తుంది అమ్మడు. ఇక ఈ లాక్ డౌన్ సమయంలో పాయల్ బాగా వర్కౌట్ చేస్తూ.. తన ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుందని ఈ ఫోటో చూస్తే అర్ధమవుతుంది.