Begin typing your search above and press return to search.
హీరోపై ఇటుక దొంగతనం కేసు నమోదు
By: Tupaki Desk | 28 March 2021 10:05 AM ISTతమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ పై బీజేపీ నాయకులు దొంగతనం కేసును పెట్టారు. అతడు ప్రభుత్వం కు చెందిన ఆస్తిని దొంగతనం చేసినట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ఇంతకు హీరో దొంగతనం చేసింది ఏంటో తెలుసా.. ఒక ఇటుక. అవును ఆయన ఒక ఇటుకను దొంగతనం చేశాడు.. ఆ విషయాన్ని అతడే స్వయంగా పేర్కొనడంతో పోలీసులు కూడా అతడిని విచారించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటుకను హీరో దొంగతనం చేయడం ఏంటి.. దానికి కేసు ఏంటి అని విషయాలు తెలియాలంటే ఈ మొత్తం కథనం చదవండి.
కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం తమిళనాట జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. డీఎంకే పార్టీ తరపున పోటీ చేస్తూ గత కొన్ని రోజులుగా ప్రచారం లో దూసుకు పోతున్న జూనియర్ స్టాలిన్ 2019లో ప్రధాని మోడీ మధురై లో ఎయిమ్స్ నిర్మాణంపై శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి నిర్మాణం జరగలేదు. అది చూపించేందుకు శంకుస్థాపన కోసం వాడిన ఇటుకను ఆయన పార్టీ నాయకులు సంపాదించారు. దానిని చూపిస్తూ మదురైలో బీజేపీ పై ఉదయనిధి మండిపడ్డాడు. మరోవైపు బీజేపీ నాయకులు ప్రభుత్వ భూమిలో చొరబడి ఇటుకను దొంగిలించినందుకు కేసు పెట్టారు. మొత్తానికి ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.