Begin typing your search above and press return to search.

ఆ క్రికెటర్‌ ముద్దుకి సెన్సార్ అడ్డు

By:  Tupaki Desk   |   28 July 2016 6:03 AM GMT
ఆ క్రికెటర్‌ ముద్దుకి సెన్సార్ అడ్డు
X
మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ బ్రెట్ లీ బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నాడు. అన్ ఇండియన్ అనే మూవీలో నటించగా.. ఇప్పటికే ఈ సినిమా పిక్చరైజేషన్ పూర్తయిపోయి సెన్సార్ దగ్గరకు కూడా వెళ్లింది. ఆగస్ట్ 19న రిలీజ్ చేయాలని భావిస్తుండగా.. ఇప్పుడీ సినిమా దర్శకుడికి సెన్సార్ నుంచి సమస్యలు వచ్చాయి.

హీరోయిన్ తనీషా ఛటర్జీకి బ్రెట్ లీ ముద్దు పెట్టే సీన్ ఒకటి అన్ ఇండియన్ క్లైమాక్స్ లో ఉంటుంది. దీని లెంగ్త్ నిమిషం 8 సెకన్లు. ఇంత పేద్ద ముద్దు కుదరదంటున్న సెన్సార్ బోర్డ్.. దీన్ని కట్ చేయాలని చెబుతోంది. ఈ లిప్ లాక్ ని 26 సెకన్లకు తగ్గిస్తేనే సర్టిఫికేట్ ఇస్తామంటోంది సెన్సార్. ఇక్కడ సీబీఎఫ్సీ అభ్యంతరాలకు మరో రీజన్ కూడా ఉంది. ఈ ముద్దు సీన్ వస్తున్నపుడు.. కాసేపటి తర్వాత బ్యాక్ గ్రౌండ్ లో 'ఓం హ్రీం శ్రీమ్' అంటూ ఛాంటింగ్ వినిపిస్తుంది. రొమాంటిక్ సీన్ లో ఇలాంటి మంత్రాలను అనుమతించబోమన్నది సెన్సార్ వాదన.

అయితే దర్శకుడి వెర్షన్ వేరేగా ఉంది. తాను హిందువునని వారి మనోభావాలు దెబ్బ తీసేలా సినిమా తీయనంటున్నాడు అనుపమ్ శర్మ. అవి మతానికి సంబంధించినవి కావని.. ఆధ్యాత్మికను సూచించేవని చెబుతున్నాడు. ఉడ్తా పంజాబ్ టైపులో తాను పొలిటికల్ గా పోరాడి.. తనను నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లను ఇబ్బంది పెట్టలేనన్న దర్శకుడు.. వీలైనంత వరకూ పోరాడతానని చెప్పాడు. ఉడ్తాపంజాబ్ సమయంలో సీబీఎఫ్సీ ఉన్నది సర్టిఫికేట్స్ ఇవ్వడానికే సెన్సార్ చేయడానికి కాదు అని బాంబే హైకోర్ట్ చెప్పిన మాటను.. లెక్కచేయకపోవడాన్ని గుర్తు చేస్తున్నాడు దర్శకుడు.