Begin typing your search above and press return to search.

ఊపిరి పీల్చుకున్న కన్నడ సినీ వర్గాలు

By:  Tupaki Desk   |   25 July 2020 1:40 PM IST
ఊపిరి పీల్చుకున్న కన్నడ సినీ వర్గాలు
X
కరోనా వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఎటాక్‌ చేస్తూనే ఉంది. సినీ ప్రముఖులు కూడా కరోనాకు అతీతులు కారని ఇప్పటికే వెళ్లడయ్యింది. బాలీవుడ్‌ టాలీవుడ్‌ శాండిల్‌ వుడ్‌ ఇలా అన్ని భాషలకు చెందిన కొందరు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అయితే కొందరు ఇప్పటికే రికవరీ అవ్వడం జరిగింది. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన సుమలత మరియు ఐశ్వర్య అర్జున్‌ లు కరోనా బారిన పడటంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన వాతావరణం నెలకొంది.

ఎంపీగా.. సీనియర్‌ హీరోయిన్‌ గా మంచి గుర్తింపు ఉన్న సుమలత కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయిన నేపథ్యంలో ఆమె సన్నిహితులు బంధువులు అభిమానులు ఆమె నియోజక వర్గ ప్రజలు కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె వయసు కాస్త ఎక్కువ అవ్వడం వల్ల ఆందోళన సహజంగానే కాస్త ఎక్కువగా పడ్డారు. సుమలత కరోనా పాజిటివ్‌ అంటూ వెళ్లడయిన కొన్ని రోజులకే అర్జున్‌ కూతురు ఐశ్వర్య అర్జున్‌ కూడా తానకు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. నాతో గత వారం రోజులుగా కాంటాక్ట్‌ లో ఉన్న ప్రతి ఒక్కరు టెస్ట్‌ కు వెళ్లండి అంటూ సూచింది.

వీరిద్దరు కూడా కరోనాను జయించారు అంటూ కన్నడ మీడియాలో ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. సుమలత ఫేస్‌ బుక్‌ ద్వారా తనకు కరోనా నెగటివ్‌ అంటూ నిర్థారణ అయ్యిందని పేర్కొంది. ఇక ఐశ్వర్య అర్జున్‌ కూడా తనకు నెగటివ్‌ వచ్చిందని మీడియా వర్గాలకు సమాచారం ఇచ్చింది. వీరిద్దరికి కరోనా నెగటివ్‌ రావడంతో కన్నడ సినీ వర్గాల్లో కాస్త ఊరట కనిపిస్తుంది. ముందు ముందు మరింత జాగ్రత్తగా ఉండాలని వీరి ఉదంతంతో తెలిసి వచ్చిందని కన్నడ సినీ జనాలు అభిప్రాయపడుతున్నారట.