Begin typing your search above and press return to search.

బెల్లం హీరో నాన్ స్టాప్

By:  Tupaki Desk   |   3 Jan 2019 7:11 AM GMT
బెల్లం హీరో నాన్ స్టాప్
X
కారణాలు ఏవైనా టాలీవుడ్ మోస్ట్ లక్కీ హీరో ఎవరయ్యా అంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరే చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా చేసిన వాటిలో ఒక్కటీ సక్సెస్ కాకపోయినా వరసగా అవకాశాలు దక్కించుకోవడం చూస్తే సదరు నిర్మాతలు అంత ధైర్యంగా ఎలా పెట్టుబడులు పెడుతున్నారన్న ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే. గత ఏడాది సాక్ష్యం పెద్ద షాక్ ఇవ్వగా కవచం కూడా దానికి తీసిపోని రీతిలో రివర్స్ కొట్టింది. అయినా కూడా మనోడికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఒక పక్క తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ తో రెండో సారి జోడి కట్టి చేస్తున్న మూవీ షూటింగ్ చివరి స్టేజిలో ఉంది.

మరోవైపు ఇదిలా ఉండగా ఇవాళ పుట్టిన రోజు సందర్భంగా మరో సినిమా అనౌన్స్ చేసాడు బెల్లం హీరో. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందే ఈ మూవీ తాలూకు లుక్ ని కూడా రిలీజ్ చేసాడు. కాస్త మాస్ టచ్ ఎక్కువగా ఉన్న గెటప్ లో గెడ్డం బాగా పెంచి స్టైలిష్ గా ఉన్నాడు కుర్రాడు. ఇది ఇప్పటివరకు ఏ సినిమాలో చూడని వైవిధ్యమైన పాత్రని శ్రీనివాస్ గతంలోనే చెప్పాడు. అయితే అసలు ఫామ్ లో లేని రమేష్ వర్మతో చేయడం గురించి అందరు అనుమాన పడ్డారు.

అయినా శ్రీనివాస్ ఇప్పటిదాకా చేసింది ఉద్దండులైన దర్శకులతోనే. కవచంతోనే డెబ్యూ డైరెక్టర్ ని ట్రై చేసాడు. ఎలా చేసినా ఫలితం ఒకటే వస్తోంది కాబట్టి ఈ సారి కథను నమ్మి దర్శకుడి ట్రాక్ రికార్డును పట్టించుకున్నట్టు లేడు. ఏదైతేనేం పెద్ద స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుర్రాళ్లే ఏడాదికి ఒక సినిమా చేయడానికి కిందామీదా పడుతుంటే సాయి శ్రీనివాస్ ఇలా దూసుకుపోవడం విశేషమే