Begin typing your search above and press return to search.

లైగర్ సినిమాకు బ్రేక్ 'హైదరాబాద్'కు మకాం!

By:  Tupaki Desk   |   8 April 2021 5:11 PM IST
లైగర్ సినిమాకు బ్రేక్ హైదరాబాద్కు మకాం!
X
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా తన సినిమా షూటింగ్ ముంబైలో నిలిపివేసినట్లు తెలుస్తుంది. కరోనా మూలంగా అటు సామాన్య ప్రజలలోనే కాదు ఇటు సినీ సెలెబ్రిటీలలో కూడా ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మహమ్మారి కారణంగా ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కరోనా ప్రభావం వలన కొందరు డైరెక్టర్స్, యాక్టర్స్ తమ షూటింగ్ లకు ప్యాకప్ చెప్పేసారు. లక్షల్లో కరోనా కేసులు బయటపడటంతో త్వరలోనే అన్ని సినిమాలకు బ్రేక్ పడేలా ఉందట. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా పూరిజగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'లైగర్'కి బ్రేక్ వేయకతప్పలేదు.

దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పూరి కనెక్ట్స్ అండ్ ధర్మ బ్యానర్స్ పై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఒక్కసారిగా కోవిడ్ సెకండ్ వేవ్ ముంబైలో వణుకు పుట్టిస్తున్న కారణంగా ఈ సినిమాకు ముంబైలో ప్యాకప్ చెప్పేసి హైదరాబాద్ కు బయలుదేరింది లైగర్ బృందం. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ, అనన్యపాండే జతకట్టనున్నారు. నిజానికి ఈ సినిమాకు మొదటి నుండి ఏదొక విధంగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. త్వరలోనే పూరీ బృందం హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేయాలనీ భావిస్తున్నారట. మరి విజయ్ పాన్ ఇండియా హీరోగా ఎలా అలరిస్తాడో చూడాలి.