Begin typing your search above and press return to search.

సెకండ్ వేవ్ తాకిడితో‌ ప్రతిష్టాత్మక తెలుగు ప్రాజెక్ట్ కి బ్రేక్?

By:  Tupaki Desk   |   13 April 2021 4:35 AM GMT
సెకండ్ వేవ్ తాకిడితో‌ ప్రతిష్టాత్మక తెలుగు ప్రాజెక్ట్ కి బ్రేక్?
X
కరోనావైరస్ రెండవ వేవ్ ప్ర‌భావం ముంబై ప‌రిశ్ర‌మ‌తో పాటు తెలుగు సినీప‌రిశ్ర‌మ‌ను భ‌య‌పెడుతోంది. మొదటి వేవ్ ని మించి వెంటాడుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు తెలుగు సినీ ప్రముఖులు కోవిడ్ నుంచి కోలుకోవడానికి గృహ‌నిర్భంధంలోకి వెళ్లార‌ని తెలుస్తోంది. తాజా స‌మాచారం మేర‌కు టాప్ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్ కూడా COVID-19 పాజిటివ్ అని తేలింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం శాకుంతలంతో బిజీగా ఉన్న గుణశేఖర్ ఇటీవ‌లే ల్యాబ్ లో టెస్టులు చేయించుకోగా వైరస్ పాజిటివ్ అని తెలిసింది. దీంతో ఈ చిత్రం షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయిందని చెబుతున్నారు. మరో ప్రముఖ దర్శకుడు విఎన్ ఆదిత్య కూడా COVID-19 కు పాజిటివ్ వ‌చ్చింద‌ని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ విష‌యంలో అధికారిక ప్రకటనలు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది.