Begin typing your search above and press return to search.
టాలీవుడ్ కు సైసై అంటున్న మరో విదేశీ అందం!
By: Tupaki Desk | 14 April 2020 3:25 PM ISTబాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా విదేశీ భామల జోరు ఈమధ్యపెరుగుతోంది. తెలుగు సినిమాల్లో విదేశీ భామలు నటిస్తూనే ఉన్నారు. కత్రినా కైఫ్ ..జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాంటి బాలీవుడ్ లో పాతుకు పోయిన విదేశీ భామలే కాదు లారిస్సా బోనేసి.. ఏంజెలా క్రిజ్లింకి.. ఇజబెల్ లీట్ లాంటి ఫారెన్ బ్యూటీలు కూడా తెలుగులో నటిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో చేరేందుకు ఓ బ్రెజిల్ భామ తెగ ఉత్సాహం చూపిస్తోంది.
ఈ భామ పేరు జెన్నిఫర్ పిచినాటో. ఈమధ్యే ఆహ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న 'సిన్' వెబ్ సీరీస్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ వెబ్ సీరీస్ లో జెన్నిఫర్ ఒక ఎన్నారై మహిళ పాత్రలో నటించింది. ఈ వెబ్ సీరీస్ చూసినవారి దృష్టిలోనూ ఇండస్ట్రీ దృష్టిలోనూ పడిందని అంటున్నారు. తెలుగు వెబ్ సీరీస్ లో నటించడం గురించి మాట్లాడుతూ వెబ్ సీరీస్ షూటింగ్ అంతా సరదాగా సాగిందని తెలిపింది. ఈ భామ గతంలో బ్రెజిల్ లో టీవీ షోస్ చేసిందట. ముంబై లో గత రెండుసంవత్సరాలుగా ఉంటూ నాటకాల్లో పాల్గొంటున్నానని తెలిపింది.
అవకాశం వస్తే టాలీవుడ్ లో నటించేందుకు రెడీ అని చెప్పుకొచ్చింది. బాహుబలి - అర్జున్ రెడ్డి లాంటి తెలుగు సినిమాలు చూసినట్టు వెల్లడించింది. సౌత్ లో చాలామంది ప్రతిభావంతులైన నటీ నటులు.. టెక్నీషియన్లు ఉన్నారని కితాబిచ్చింది. మరి ఈ హాటు బ్యూటీకి ఎవరైనా కరోనా హంగామా సద్దుమణిగిన తర్వాత మంచి ఆఫర్లు ఇస్తారేమో వేచి చూడాలి.