Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రేష్మ ర్యాంప్ వాక్ అదిరే

By:  Tupaki Desk   |   9 Sep 2016 3:30 PM GMT
ఫోటో స్టోరి: రేష్మ ర్యాంప్ వాక్ అదిరే
X
ఎంతసేపూ అందమేనా. ఎంతసేపూ అందమైన నయనం.. యవ్వనం తాలూకు సెగలు ఎగసిపడుతున్న ఒంపుసొంపుల్లో దాగిన మాధుర్యం.. ఆ మత్తు.. ఆ హొయలు.. అవేనా. ఆగండి ఆగండి. ఈసారి న్యూయార్క్ లో ఇప్పుడు జరుగుతున్న ప్రఖ్యాత న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో.. సన్నీ లియోన్ నడవడం కంటే కూడా పెద్ద సంచలన ఒకటి చోటుచేసుకుంది. ''యాసిడ్ ఎటాక్ బాధితులను జాలిగా చూడకండి. మేము కూడా వెలుగులోకి వచ్చి ఎన్నో చేయగలం'' అనే మెసేజ్ ఇవ్వడానికి ఈ ర్యాంపుపై డిజైనర్ అర్చనా కొచ్చార్ డిజైన్ చేసిన బట్టల్లో మెరిసినట్లు.. రేష్మ ఖురేషి అనే అమ్మాయి తెలిపింది. రేష్మ అలా ర్యాంపుపైన వాక్ చేయడం మొదలెట్టిందో లేదో.. అక్కడి ఆడిటోరియం అరుపులు, కేకలు, వీలలతో దద్దరిల్లిపోయింది.

2014లో 19 ఏళ్ళ రేష్మ ఖురేషిపై ఆమె అక్కడ మొగుడు యాసిడ్ పోశాడు. ముంబయ్ లో ఆమె ఫ్యామిలీ ఉంటున్నప్పటికీ.. ఆమె 10వ తరగతి పరీక్షలు రాయడానికి అల్హాబాద్ దగ్గర్లోని పల్లెటూరికి వెళ్ళింది. బుర్ఖాలో ఉన్న ఆమెను తన భార్య అనుకున్న సదరు ఆగంతకుడు.. యాసిడ్ పోసేయడంతో.. రేష్మ బానో ఖురేష్‌ జీవితం తల్లక్రిందులైంది. అద్దంలో తన ముఖం చూసుకుని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న రేష్మ.. రియా శర్మ అనే అమ్మాయి స్టార్ట్ చేసిన ''మేక్ లవ్ నాట్ స్కార్స్'' అనే ఎన్.జి.ఓ సహాయంతో డిప్రెషన్ ను జయించి.. ఇప్పుడు ఇలా న్యూయార్క్ లో మోడల్ గా సత్తాచాటింది. అసలు మార్కెట్లో ఫ్రీగా యాసిడ్ ను విక్రయించడం కారణంగా ఇలాంటి అగాయిత్యాలు జరుగుతున్నాయంటూ.. యాసిడ్ బ్యాన్ చేయమని రేష్మ పోరాడుతోంది.

గత రాత్రి న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ ర్యాంప్ పై నడిచిన ఈ అమ్మాయి.. కరేజ్‌ కు కొత్త అర్ధం చెప్పింది కదూ. హ్యాట్సాఫ్‌ టు యు రేష్మ!!