Begin typing your search above and press return to search.

ఉరికే పెట్టుకున్నారా? లేక ప్రమోషన్సా?

By:  Tupaki Desk   |   7 Nov 2017 7:36 AM GMT
ఉరికే పెట్టుకున్నారా? లేక ప్రమోషన్సా?
X
ఒక సినిమా రూపొందుతోంది అంటే ఆ సినిమా కంటెంట్ ని బట్టి కొన్ని కంపెనీలు సినిమాలో ఎదో విధంగా బ్రాండింగ్ ఉండేలా చూసుకుంటాయి. ఒక్కసారి సినిమా నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకుంటే చాలు సినిమా చూసిన ప్రతి సారి ఆ బ్రాండింగ్ కి ప్రమోషన్స్ వచ్చినట్టే. ఈ తరహాలో చాలా కంపెనిలు సినిమాల్లో వారి సంస్థల పేర్లు గాని మార్క్ గాని ఉండేలా ఒప్పందం చేసుకొని ప్రమోషన్స్ చేసుకుంటాయి.

అయితే ఇప్పుడు రంగస్థలం 1985 సినిమాకు కూడా ఇదే తరహాలో ఆఫర్స్ వస్తున్నాయి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయినా సినిమా 1980 కాలం నాటిది కదా ? ఈ సినిమాలో ప్రస్తుతం ఉన్న కంపెనీలు ఎందుకు ఫిక్సిడ్ ప్రమోషన్స్ చేసుకుంటాయి అనే ఆలోచన రావచ్చు. కానీ రీసెంట్ గా రంగస్థలం సినిమా షూటింగ్ కోసం వేసిన కొన్ని సెట్స్ ని చూస్తే.. నిజమేనా అని అనుకుంటాం. ఎందుకంటే నంది పైపులు అని ఒక స్టాల్ సెట్ లో కనిపిస్తోంది. అప్పట్లో చార్మినార్ రేకులు.. అలాగే నంది పైపులు.. గోదావరి ఎరువులు అని ఈ తరహా కంపెనీల ప్రకటనలు ఎక్కువా కనిపించేవి. ఇప్పటికి కూడా వాటి మార్కెట్ బాగానే ఉంది.

సినిమా పూర్తిగా 1980లోకి తీసుకెళ్లేలా ఉండాలని సుకుమార్ ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ఈ తరహా కంపెనీల పేర్లు కేవలం సినిమా కోసమే వాడుకున్నారా.. లేక కంపెనీలే ప్రమోషన్స్ కోసం స్పెషల్ గా ఒప్పందం చేసుకున్నారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.