Begin typing your search above and press return to search.

బ్రహ్మోత్సవంలో అసలు ఎలిమెంట్ అదా?

By:  Tupaki Desk   |   22 Feb 2016 3:58 AM GMT
బ్రహ్మోత్సవంలో అసలు ఎలిమెంట్ అదా?
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు- శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే.. కుటుంబ కథా చిత్రం చేస్తున్నారనే ఎక్స్ పెక్టేషన్సే ఇప్పటివరకూ ఉన్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అదో జోనర్ లో ఉండడమే దీనికి కారణం. కానీ.. ఆసారి మాత్రం ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాడు మహేష్. పూర్తి స్థాయి లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని తెలుస్తోంది.

గతంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ తో సీతమ్మ వాకిట్లో రాగా.. ఆ సారి బ్రహ్మోత్సవంలో మోడ్రన్ కల్చర్ లవ్ స్టోరీ చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ దర్శకుడికి ఫ్యామిలీ ఎలిమెంట్స్ బలం. అందుకే వాటిని కూడా భారీగానే మిక్స్ చేశారు. బ్రహ్మోత్సవం అంటూ ఓ పండుగ రేంజ్ లో ఉండనున్న ఈ మూవీలో.. మహేష్ బాబు లవ్ ట్రాక్ స్పెషల్ గా ఉండనుందట. ఫుల్ ప్లెడ్జెడ్ లవ్ స్టోరీలో సూపర్ స్టార్ ని చూసి చాలా రోజులు కావడం, మోడర్న్ డేస్ లో లవ్ జర్నీని ఆకట్టుకునేలా పిక్చరైజ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్ ప్రిన్స్ పక్కన కాజల్ అగర్వాల్ - సమంత - ప్రణీతలు హీరోయిన్స్ గా నటిస్తున్న బ్రహ్మోత్సవంలో.. మహేష్ ప్రేమించేది ఎవరినో మాత్రం చెప్పడం లేదు. కానీ సినిమాలో మిగతా ఎలిమెంట్స్ కంటే.. లవ్ స్టోరీనే కీలకం అని, ఆడియన్స్ ని థ్రిల్ చేయడం ఖాయమని తెలుస్తోంది.