Begin typing your search above and press return to search.

షూటింగ్‌ లో ఉండగా హీరోకు బ్రెయిన్‌ స్ట్రోక్‌

By:  Tupaki Desk   |   30 Nov 2020 2:00 PM IST
షూటింగ్‌ లో ఉండగా హీరోకు బ్రెయిన్‌ స్ట్రోక్‌
X
బాలీవుడ్‌ లో వరుసగా విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాదిలో ఎంత మంది బాలీవుడ్‌ ప్రముఖులను కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ఎప్పుడెప్పుడు ముగిసి పోతుంది అంటూ ఎదురు చూస్తున్న సమయంలో బాలీవుడ్‌ అభిమానులకు మరో షాకింగ్‌ విషయం తెలిసింది. రొమాంటిక్‌ హీరోగా పేరున్న రాహుల్‌ రాయ్‌ కి బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. ఆయన ప్రస్తుతం ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందనే ప్రచారం జరుగుతోంది.

కార్గిల్‌ లో షూటింగ్‌ లో ఉండగా రాహుల్‌ రాయ్‌ కి బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చినట్లుగా చెబుతున్నారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ కు కారణం కార్గిల్‌ లో ఉన్న వాతావరణం అంటూ వైధ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులే రాహుల్‌ అనారోగ్య పరిస్థితికి కారణం అయ్యి ఉండవచ్చు అంటూ వైధ్యులు పేర్కొనడంతో వెంటనే ముంబయి లీలా వతి ఆసుపత్రికి తరలించినట్లుగా ఆయన సోదరుడు పేర్కొన్నాడు. ప్రస్తుతం రాహుల్‌ ఆరోగ్యం విషయంలో ఆందోళన ఏమీ లేదని.. ట్రీట్‌మెంట్‌ కు రాహుల్‌ స్పందిస్తున్నాడు. త్వరలోనే రాహుల్‌ మామూలు మనిషి అవుతాడనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు.

1990 సంవత్సరంలో అషికి సినిమాతో రాహుల్‌ హీరోగా పరిచయం అయ్యాడు. మహేష్‌ భట్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాతో రాహుల్‌ స్టార్‌ అయ్యాడు. మొదటి సినిమా సక్సెస్‌ అవ్వడంతో ఆయన తిరిగి వెనక్కు చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎల్‌ ఏ సీ సినిమా షూటింగ్‌ కోసం కార్గిల్‌ లో ఉన్న సమయంలో రాహుల్‌ కు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడం జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.