Begin typing your search above and press return to search.

హమ్మయ్యా.. సమంత సాంగ్‌ వచ్చింది

By:  Tupaki Desk   |   18 May 2016 9:58 AM GMT
హమ్మయ్యా.. సమంత సాంగ్‌ వచ్చింది
X
ఎప్పటినుండో ఎదురు చూస్తుంటే.. అసలు ఇప్పటివరకు సమంతకు సంబంధించి ''బ్రహ్మోత్సవం'' నుండి ఒక్క పాట కూడా బయటకు రాలేదు. ఎన్ని పాటల మేకింగ్‌ వీడియోలు రిలీజ్ అయినా కూడా.. అందులో అన్నింటిలోనూ కాజల్‌ మాత్రమే ఉంది. సంగీత్‌ సాంగ్‌ లో ప్రణీత.. మధురం మధురం లో ఓన్లీ మహేష్‌.. బాలాత్రిపురమణి పాటలో కాజల్‌.. తప్పించి.. సమంత ఎక్కడ గురూ?

ఫైనల్‌ సినిమా రిలీజ్‌ ఇంకో రెండు రోజులు ఉందనగా.. అసలు సమంత సాంగ్‌ ను విడుదల చేశారు. ''పుట్‌ యువర్‌ హ్యాండ్స్‌ అప్‌'' అంటూ సాగే పాటలో సమంత తళుక్కుమంది. ఆ పాటలో సమంత - మహేష్‌ - వెన్నెల కిషోర్‌ అండ్‌ నాజర్‌ ఒక పబ్బుకు వెళ్ళి.. అక్కడ ఎలా ఎంజాయ్‌ చేస్తారు అనేదే సిట్యుయేషన్‌. చాలా కూల్‌ అండ్ టెక్నోగా ఉంది ఈ సాంగ్‌. మేకింగ్‌ వీడియో చూస్తుంటే ప్రొడక్షన్‌ వాల్యూస్‌ ఎలా ఉన్నాయ్‌ అనే విషయం తెలుస్తోంది. వీటన్నింటికంటే ఎక్కువగా సమంత పాట రిలీజైనందుకు ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

నిజానికి ఈ సినిమాలో ఫస్టాఫ్‌ లో వచ్చే సమంత-మహేష్‌ ల లవ్‌ స్టోరీ చాలా కీలకమట. ఏడు తరాల కుటంబ సభ్యులను కలుసుకోవాలి అనేది సమంత లైఫ్‌ ఫిలాసఫీ. అయితే మహేష్‌ ను ప్రేమించిన కొన్నాళ్ళకు ఆమె క్యారెక్టర్‌ చనిపోతుందట. ఆ తరువాత మహేష్‌ సమంత కోరికను ఎలా నెరవేర్చాడనేదే సినిమా అని కొందరు చెబుతున్నారు. లెటజ్‌ సీ!!