Begin typing your search above and press return to search.

మహేష్ చెప్పులు తొడుగుతున్నదెవరికి..?

By:  Tupaki Desk   |   7 April 2016 4:41 PM IST
మహేష్ చెప్పులు తొడుగుతున్నదెవరికి..?
X
ఆ మధ్య జనవరి 1న ‘బ్రహ్మోత్సవం’ టీజర్ తో మ్యాజిక్ చేసి వెళ్లిపోయిన మహేష్ బాబు.. మళ్లీ ఇప్పుడు ఉగాది వేళ అభిమానుల్ని మరోసారి పలకరించాడు. వెరైటీగా ఓ బ్లాక్ అండ్ వైట్ పోస్టరుతో జనాలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పాడు. టీజరలో కనిపించిన డ్రెస్సులోనే ఉన్న మహేష్.. మోకాలి మీదికి వంగి ఓ పెద్ద మనిషికి చెప్పులు తొడుగుతున్న పోస్టర్ చాలా వెరైటీగా ఉంది. ఇంతకీ మహేష్ ఎవరికి చెప్పులు తొడుగుతున్నాడబ్బా అన్న చర్చ మొదలైపోయింది అభిమానుల్లో. మహేష్ తో చెప్పులు తొడిగించుకునేంత స్టేచర్ ఉన్న ఆర్టిస్టు ఎవరున్నారా అని ఆలోచిస్తే.. బహుశా అది సత్యరాజే కావచ్చని తెలుస్తోంది.

‘బ్రహ్మోత్సవం’లో సత్యరాజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. బహుశా ఆయనది మహేష్ తండ్రి పాత్రే కావచ్చేమో. ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ నెల 10 నాటికి టాకీ పార్ట్ మొత్తం పూర్తయిపోతుందని అంటున్నారు. రామోజీ ఫిలిం సిటీలో పతాక సన్నివేశాల చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు మహేష్. ఆ తర్వాత పుణెలో రెండు పాటల చిత్రీకరణ జరుగుతుంది. ఈ నెల 24న ‘బ్రహ్మోత్సవం’ ఆడియో వేడుకను తిరుపతిలో ప్లాన్ చేశారు. ఇంతకుముందు మే మధ్యలో లేదా చివరి వారంలో సినిమా రిలీజ్ కావచ్చని అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా మే 6న విడుదల అని ప్రచారం జరుగుతోంది.